రైతుకు గిట్టుబాటు ధర చర్యలు చేపట్టకపోతే తీవ్ర పరిణామాలుంటాయి :వైఎస్ జగన్

 రైతుకు గిట్టుబాటు ధర చర్యలు చేపట్టకపోతే తీవ్ర పరిణామాలుంటాయి :వైఎస్ జగన్


 

 గుంటూరు (ప్రజా అమరావతి);

రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు ఏ రైతు కూడా సంతోషంగా లేడు


రైతుల దీన స్థితికి కారణం కూటమి ప్రభుత్వం కాదా ? కూటమి ప్రభుత్వానికి మాజీ సీఎం జగన్ సూటి ప్రశ్న


వైస్సార్సీపీ హయాంలో రైతే రాజు కానీ, కూటమి ప్రభుత్వం రైతును దగా చేస్తుంది


చంద్రబాబు ప్రభుత్వం రైతులను దళారులకు అమ్మేసింది. మేము తీసుకొచ్చిన RBK వ్యవస్థ, ఈ క్రాప్ వ్యవస్థ ఈరోజు నిర్వీర్యమైపోయింది

 

మిర్చి రైతుల ఇబ్బందులు సీఎం చంద్రబాబుకు పట్టడం లేదు. ప్రస్తుతం క్వింటాకు రూ.10-12 వేలు కూడా రావడం లేదు


మా హయాంలో రూ.21 నుంచి 27 వేల వరకు ధర వచ్చేది..రైతులు పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి


ఇప్పటికైనా రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చంద్రబాబు చర్యలు చేపట్టకపోతే తీవ్ర పరిణామాలుంటాయి 


ఒక ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తే కనీసం పోలీసు భద్రత కూడా చంద్రబాబు ఇవ్వలేదు. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు


రేపు మేము వచ్చినప్పుడు మీకు పోలీసు భద్రత ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలని హితవు పలికారు


రాబోయే రోజుల్లో రైతుల తరఫున ఉద్యమిస్తామని జగన్ స్పష్టం చేశారు.



Comments