మైనారిటీ వర్గాలవారి రాయితీ రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయం.

 మైనారిటీ వర్గాలవారి రాయితీ రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయం


  అమరావతి (ప్రజా అమరావతి);

జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి చేబ్రోలు ఒక ప్రకటన చేస్తూ  ఈ ఉత్తర్వులు ద్వారా 49, 218 మంది మైనారిటీ వారికి లబ్ది చేకూరనుంది. గత ప్రభుత్వం జగన్మోహన్ గారి ఐదు ఏళ్ల పాలనలో ఒక్కరి కంటే ఒక్కరికి కూడా స్వయం ఉపాధి కల్పించలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలలోనే స్వయం ఉపాధికి 326 కోట్లు బడ్జెట్ కేటాయించడం అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం అభినందనీయమని డాక్టర్ జోసఫ్ అన్నారు, అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఒకటి రెండు రోజులలో జీవో విడుదలవుతుందని, అంతర్జాలం apobmms పోర్టల్ లో లబ్ధిదారులు నమోదు చేసుకొన వచ్చు, క్రైస్తవులైన వారు కూడా అప్లికేషన్ పెట్టుకొనవచ్చును, షెడ్యూల్ కులాల వారికైతే బిసి-సి సర్టిఫికెట్ ఉండాలి, మిగతా కులాల వారికి బాప్టిజం సర్టిఫికెట్ ఉండాలి, సంవత్సర ఆదాయం పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షలు గ్రామీణ ప్రాంతాలలో వరకైతే 1 50,000 దాటి ఉండకూడదు. ఇంకా వివరంగా నియమ నిబంధనలు నోటిఫికేషన్ లో చూచుకొనవచ్చును


1 లక్ష నుంచి 8 లక్షల వరకు, వారు ఏర్పాటు చేసుకునే యూనిట్ బట్టి ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది, దానికి అనుగుణంగా రాయితీ కూడా అందుతుంది.సొంతంగా పెట్టుకోవడం వలన కొంతమందికి ఉపాధి చూపించిన వారు అవుతారు,  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రొఫెసర్ జోసఫ్ మోసిగంటి సూచించారు 


ఈ క్రింది యూనిట్లు ఏర్పాటు చేసుకున్న వారికి రుణ పథకాలు వర్తిస్తాయి

1. ఈవెంట్ మేనేజ్మెంట్, ఫిజియోథెరపీ శిక్షణ

2. టైలరింగ్ / ఫ్యాషన్ డిజైనింగ్

3. ఫిట్నెస్ సెంటర్లు, ఆటోమొబైల్ యూనిట్లు, జనరిక్ మెడికల్ దుకాణాలు

4. కిరాణా, పాన్, చికెన్, మటన్, పండ్ల దుకాణాలు, కూరగాయల అమ్మకం, ఎలక్ట్రికల్ మరమ్మతులు, సైకిల్ షాపులు తదితరాలు

5. ఏసి, ఫ్రిడ్జ్ మరామత్తు, ఆటోమొబైల్స్ స్పేర్స్ పార్ట్, బ్యాటరీ సర్వీసింగ్ అండ్ సేల్స్, సెల్ ఫోన్ సేల్స్, ఫుట్వేర్ షాపులు తదితరులు

6. ఆటోమొబైల్ సెక్టార్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఫ్యాబ్రికేషన్ కు సంబంధించిన అన్ని యూనిట్లు

Comments