తాడేపల్లి (ప్రజా అమరావతి);
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పనిచేసే వేతనదారులకు పథకం పట్ల మరింత అవగాహన
, ఉపయోగాలు తెలియజేయడం. అలాగే రూ. 300/- కూలీ వచ్చే౦దుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక పర్యటనలు చేశారు.
వేతనం రూ.300/- వచ్చేలా క్షేత్ర స్థాయి సిబ్బంది మార్కవుట్లు ఇవ్వడం, మార్కవుట్ల ప్రకారం పనిచేసి పూర్తి వేతనం పొందే౦దుకు అవసరమైన అవగాహన కూలీలకు కల్పించడం లక్ష్యంగా 26 జిల్లాల్లోని విజిలెన్స్, సోషల్ ఆడిట్, క్వాలీటీ కంట్రోల్ అధికారులు ఆకస్మిక క్షేత్ర పర్యటనలు జరిపారు. ఉపాధి హామీ పనులు ముమ్మరంగా జరుగుతుండడం, అధిక సంఖ్యలో కూలీలు హాజరవుతున్న నేపథ్యంలో మార్కవుట్ల తనిఖీ, బోగస్ హాజరు నివారణకు ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక తనిఖీ అధికారులు 347 గ్రామపంచాయతీల్లో 985 పనులను, విజిలెన్స్ అధికారులు 52 గ్రామపంచాయతీల్లో 208 పనులను, క్వాలీటీ కంట్రోల్ అధికారులు 61 గ్రామపంచాయతీల్లో 85 పనులను పర్యవేక్షించారు. 19-2-2025 అంటే ఈరోజు 12,019 గ్రామాల్లో జరిగిన 21,055 పనులకు గానూ 8.9 లక్షల మంది వేతనదారులు పనికి హాజరయ్యారు.
ఇదే విధంగా ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తూ పథకం మరింత సమర్థవంతంగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు.
addComments
Post a Comment