గుంటూరు (ప్రజా అమరావతి );
జన ఔషధీ దివాస్ సందర్భంగా గుంటూరు జిల్లాలో అత్యంత ప్రజాదరణ పొందిన రెండు ప్రధానమంత్రి భారతీయ జన ఔషధీ కేంద్రాలకు ఈరోజు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. గుంటూరు శ్యామల నగర్ లోని జన ఔషధీ కేంద్రం వద్ద జన ఔషధీ దివాస్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో అత్యంత ప్రజాధరణ పొందిన వారికి సర్వ శ్రేష్ట అవార్డులు అందజేశారు. మొదటి స్థానంలో తెనాలి, మంగళగిరిలోని జన ఔషధీ కేంద్రాలు నిలిచాయి. ఆ రెండు షాపులు యజమాని దివ్వెల. ఏడుకొండలును శాలువాతో సత్కరించి ,సర్వ శ్రేష్ట అవార్డు అందజేశారు. అలాగే రెండో స్థానంలో నిలిచిన గుంటూరులోని జన ఔషధీ కేంద్రం యజమాని మునగపాటి. సుబ్బారావుకు, సర్వ శ్రేష్ట అవార్డు అందజేశారు. భారతదేశంలో ఏటా మార్చి 7న జన ఔషధీ దివాసుగా నిర్వహిస్తారు. జనరిక్ మందులో వాడకంపై ప్రజలలో అవగాహన కల్పించాలని లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజును ప్రకటించారు. తక్కువ ధరలకు మందులను వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో ఔషధ నియంత్రణ పరిపాలన డైరెక్టర్ ఎం బి ఆర్ ప్రసాద్, గుంటూరు డిప్యూటీ డైరెక్టర్ విజయ శేఖర్, జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డి. లక్ష్మణ్, డీఎంహెచ్వో విజయలక్ష్మి, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు ఎస్ వి ఎన్ పద్మ, ఎన్ మహేష్ పి. మంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment