పేరుకు వైన్ షాపే అయినా బార్ షాప్ లా మార్చేశారు.

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


*వైన్ షాప్ లో తాగుతున్నారు*


*సమీపంలోని ఇళ్లలోకి దూరుతున్నారు*


*రోడ్ మీద నానా యాగీ చేస్తున్నారు*


*పేరుకు వైన్ షాపే అయినా బార్ షాప్ లా మార్చేశారు


*


*ప్రధాన రోడ్ లో షాప్... అక్కడే తాగడం...అక్కడే కక్కడం....ఇంకా మూత్ర విసర్జనలు....భరించలేని కంపు....ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే...ఎన్నో..*


*ఇదంతా ఉండవల్లి కూడలి నుండి తాడేపల్లి వైపు వెళ్ళేటప్పుడు, ప్రధాన రోడ్ పక్కనే ఏర్పాటు చేసిన వైన్ షాప్..చుట్టుపక్కల నివసిస్తున్న మహిళల ఆవేదన ఇది*


*కొద్ది నెలల క్రితం వైన్ షాప్ ఏర్పాటు చేసే ముందు...మహిళలు వద్దన్నా....ఆ షాప్ దక్కించుకొంది.. అధికార పార్టీ నాయకులు కావడంతో, స్థానికంగా ఉండే కొంతమంది అంటే...అదే అధికార పార్టీ కి చెందిన నాయకులు.. తొలుత హడావుడి చేసి....వారికి కావాల్సిన ప్రతిఫలాలు అందుకుని... స్థానిక మహిళలను బుజ్జగించి....దగ్గరుండి మరి షాప్ తెరిపించారని...అందరికి తెలిసిన విషయమే....ఇప్పుడేమో...పరిస్థితి ఇలా....*


*అదే మహిళలు నేడు రోడ్ ఎక్కి...తమ ఆవేదన ను బహిరంగంగా వ్యక్త పరచడమే కాకుండా.... తహశీల్దార్ కార్యాలయంలో, పోలీసు స్టేషన్ లో, సదరు వైన్ షాప్ తొలగించాలని డిమాండ్ చేస్తూ...గురువారం వినతిపత్రాలు అందజేశారు*


*స్థానిక మహిళలు మాట్లాడుతూ... ఆ షాప్ లో కేవలం మందు(మద్యం) , కొనుక్కొని తీసుకు వెళ్లిపోతారని... తమని నమ్మబలికారని, ఇప్పుడేమో అక్కడే తాగుతూ, తూలుతూ తిరిగే మందు బాబుల మధ్య, ప్రయాణించాలంటే మహిళలు, చదువుకొనే ఆడ పిల్లలు, ఇబ్బందులు పడుతున్నామని...ఆవేదన వ్యక్తంచేశారు*


*ఆ వైన్ షాప్ ను తొలగించకుంటే....ధర్నా చేయడనికి ఐనా సిద్ధమేనని, మహిళలు హెచ్చరిస్తున్నారు*


*అధికార పార్టీ నాయకులకు చెందిన, ఆ వైన్ షాప్ విషయంలో అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో....చూడాలి*

Comments