మెప్మా – హోమ్ ట్రైయాంగిల్ సర్వీసెస్ కు విశేష స్పందన
తాడేపల్లి (ప్రజా అమరావతి):
· రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గ సమక్షం లో, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పి.నారాయణ పర్యవేక్షణలో మెప్మా మిషన్ డైరెక్టర్ శ్రీ ఎన్. తేజ్ భారత్, I.A.S మార్చి 8న మార్కాపురం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా మెప్మా మరియు హోమ్ ట్రైయాంగిల్ సర్వీసెస్ యాప్ ని లాంఛనంగా ప్రారంభించారు.
· దీనిలో భాగంగా ఈ రోజు ది.16.04.2025న మెప్మా మిషన్ డైరెక్టర్ హోమ్ ట్రైయాంగిల్ సంస్థ ప్రతినిధులతో తాడేపల్లి ప్రధాన కార్యాలయం నందు సర్వీస్ సెక్టార్ సేవలు గురించి పటిష్టమైన ప్రణాళికతో పాటు స్వయం సహాయక సంఘ మహిళల కుటుంబాలకు సుస్థిరమైన జీవనోపాధి మరియు ఆర్ధికాభివృద్ధి కోసం సమావేశం నిర్వహించారు.
· హోమ్ ట్రైయాంగిల్ సర్వీస్ సెక్టారు లో ఎలక్ట్రీషియన్ లు, బ్యూటీషియన్ లు, ప్లంబర్లు, బార్బర్లు, కార్పెంటర్లు మరియు హోమ్ అప్లయన్సెస్ కేటగిరీలలో ఇప్పటివరకు దాదాపు 12,500 మంది నమోదు అయ్యారు. ప్రస్తుతం దీనిలో సుమారు 4,500 కి పైగా వారి సేవలను ప్రజలకు అందిస్తున్నారు. ఈ సేవల ద్వారా రోజుకి రూ.1,000/- నుంచి రూ.1,500/- కు పైగా సంపాదన వల్ల సర్వీస్ అందించిన వారు ఆనందం వ్యక్త్యం చేస్తున్నారు.
· మిగిలిన వారికి కూడా తగిన శిక్షణ అందించి వారికి లబ్ది చేకూరేలా మెప్మా మిషన్ డైరెక్టర్ పటిష్టమైన యాక్షన్ ప్లాన్ రూపొందించి హోమ్ ట్రైయాంగిల్ సంస్థ వారికి తగు సూచనలు ఇచ్చారు.
· హోమ్ ట్రైయాంగిల్ ద్వారా అందిస్తున్న సేవలు ప్రతి ఒక్కరు సద్వినియోగ పరచుకుని ఇంటివద్దకే నాణ్యమైన సేవలు పొందటం ద్వారా SHG కుటుంబ సభ్యులకు ఆర్ధికంగా లబ్ది చేకూరుతుంది.
· వీరి సేవలు ద్వారా తక్కువ ఖర్చు తో నాణ్యమైన సేవలు అందిస్తున్నందుకు వినియోగదారులు సంతృప్తి చెందుతూ మెప్మా సంస్థకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
· ప్రతి సెక్టార్ లోనూ అనూహ్యమైన స్పందన వస్తుందని ఈ సేవలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోలని మెప్మా మిషన్ డైరెక్టర్ కోరుతున్నారు.
addComments
Post a Comment