జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల ఆందోళన.

*జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల ఆందోళన



*రెండు చట్టాలను కేంద్రం రద్దు చేయడంపై నిరసన*

 

 *ఏపీలో జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి* 


 *విశాఖలో రాష్ట్రకార్యవర్గం సమావేశం లో కీలక నిర్ణయాలు*


ఆంధ్ర యూనివర్సిటీ.. జులై 29 (ప్రజా అమరావతి);


 దేశ వ్యాప్తముగా జర్నలిస్టులకు సంబంధించిన రెండు కీలక చట్టాలను కేంద్రం రద్దు చేయడం పట్ల నిరసిస్తూ జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్..వెంకటరావు ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు ప్రకటించారు..గురువారం ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ హాల్ లో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వీరు మాట్లాడుతూ కేంద్రం తాజాగా 44 కార్మిక చట్టాలను రద్దు చేసిందని అందులో రెండు జర్నలిస్టులకు సంబంధించినవి  ఉన్నాయన్నారు.. వర్కింగ్ జర్నలిస్టుల  చట్టం 1955,

.. వేతనాల చెల్లింపులు చట్టం 1958 రద్దు చేసిన వాటిలో ఉన్నాయన్నారు.. వీటిని తక్షణమే పునరుద్ధరించాలని జూన్ 9 న నిర్వహించే జాతీయ కార్మిక సంఘాలు ఆందోళనలో జర్నలిస్టులు కూడా పాల్గొనాలని వీరు పిలుపునిచ్చారు.

రాష్ట్రము లో.....


రాష్ట్రంలో కూటమి  ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన తప్పదని రాష్ట్ర అధ్యక్షులు ఎస్. వెంకటరావు, జి. ఆంజనేయులు  పేర్కొన్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న నేటికి అక్రిడేషన్ లు కొత్తవి మంజూరు చేయలేదన్నారు అలాగే ప్రభుత్వాలు మారినప్పటికీ జర్నలిస్టులు ఇళ్ల స్థలాలకు సైతం నోచుకోలేదన్నారు..  11రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పెన్షన్ పథకం అమలు చేయాలని,

మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని,. ప్రమాద బీమా పునరుద్ధరించాలని ఇలా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నట్లు వీరు చెప్పారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానాలను త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు నివేదిస్తామన్నారు. జర్నలిస్టులపై దాడులు నిరోధానికి ప్రత్యేక చట్టం చేయాలని అలాగే జర్నలిస్టులకు పత్రిక స్వేచ్ఛ కల్పించాలని తీర్మానములు చేసారు.. ఈ సమావేశంలో వర్కింగ్ జర్నలిస్టుల  ఫెడరేషన్, బ్రాడ్ కాస్ట్ కు సంబందించిన  నూతన వెబ్ సైట్ ను ఆవిష్కరించారు  సమావేశం లో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ విశాఖ వేదికగా త్వరలో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి తమ కార్యవర్గం తమ వంతు కృషి చేస్తుందన్నారు ఈ సమావేశంలో

 ఎన్ ఎ జే సెక్రటరీ జనరల్ ఎం కొండయ్య..జెండర్ ఈక్విటీ కౌన్సిల్ చైర్మన్ కే మంజరి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ కార్యదర్శి జి శ్రీనివాసరావు బ్రాడ్ కాస్ట్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వర్ రావు, కార్యదర్శి కె. మదన్, చిన్న మధ్య తరహో పత్రికల సంఘం అధ్యక్షులు జగన్ మోహన్, కె. శ్రీనివాస్ రావు,వివిధ జిల్లాలకు చెందిన ఫెడరేషన్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...

Comments