గుంటూరు (ప్రజా అమరావతి);
జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణతో పాటు భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెని క్రిస్టినా సూచించారు. గుంటూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ఎంపీడీవోలు పరిపాలన అధికారుల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అదేవిధంగా ప్రారంభోత్సవాలు ,సభలు సమావేశాల సమయంలో ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు . జిల్లా పరిషత్ కు రావలసిన ఆదాయం విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పారు. అదే విధంగా జిల్లా పరిషత్ కు సంబంధించి రేవుల వేలం పాటలు, షాపింగ్ కాంప్లెక్స్ ల రావలసిన బకాయిలు తదితర విషయాలను గురించి చర్చించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆమె అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న కళ్యాణ మండపాలు షాపులు ఇతర ఆదాయ వనరులకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సీఈవో జ్యోతి బస్సు మాట్లాడుతూ జిల్లా పరిషత్తుకు సంబంధించిన బకాయిలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కృష్ణా నదిపై తిరిగే పడవల వివరాలను తెలుసుకున్నారు. వాటి వలన వచ్చే ఆదాయం గురించి అడిగారు. బకాయిలను త్వరగా గతిన వసూలు చేయాలని కోరారు ఆయా మండలాల సంబంధించిన ఆడిట్ ను త్వరితగతిన సమర్పించాలని సూచించారు. డిప్యూటీ సి ఈ ఓ కృష్ణ మాట్లాడుతూ ప్రతినెల ఇవ్వాల్సిన నివేదిక వివరాలను ఎంపీడీవోలను అడిగారు. అదే విధంగా యాన్యువల్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్, పెండింగ్ లో ఉన్న బకాయిలను కోర్టులో ఉన్న కేసుల వివరాలు అడిగారు. వివిధ అంశాలపై పూర్ణచంద్రారెడ్డి, శోభారాణి ,తోట ఉషాదేవి నివేదిక సమర్పించారు. కార్యక్రమంలో అకౌంట్స్ ఆఫీసర్ సామ్యూల్ పాల్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment