త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీ.

 *త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీ


*


* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

* పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు

* త్వరలో అక్రమ కేసుల మాఫీనా నిర్ణయం

* రాయలసీమ అభివృద్ధే సీఎం చంద్రబాబు ధ్యేయం

* కడప మహానాడు విజయంతం చేద్దాం : మంత్రి సవిత


పుట్టపర్తి (ప్రజా అమరావతి);: టీడీపీ అభివృద్ధికి కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఇస్తామని, త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై గత ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల మాఫీపైనా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. పుట్టపర్తిలో శనివారం నిర్వహించిన జిల్లా మహానాడు సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. పేదలకు, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన ఘనత ఎన్టీఆర్ దేనన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో టీడీపీ మరింత బలోపేతమైందన్నారు. దేశంలో ఏ పార్టీకీ లేని కార్యకర్తల బలం టీడీపీకి మాత్రమే సొంతమన్నారు. కన్నబిడ్డల మాదిరిగా కార్యకర్తలను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కాపాడుకుంటున్నారన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నామన్నారు. పేద కార్యకర్తల పిల్లల చదువులకు పార్టీ అధిష్టానం అండగా నిలుస్తోందన్నారు.  


*రాయలసీమలో ప్రతి ఎకరాకూ నీరందిస్తాం...*


సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ జోరుగా సాగుతోందని మంత్రి సవిత తెలిపారు. ఇప్పటికే అమరావతి, పోలవరం ప్రాజెక్టు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. మరో కొద్ది నెలల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి కానుందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే, రాయలసీమలో ప్రాజెక్టులన్నీ నీటితో నింపుకోవోచ్చునన్నారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్టు కూడా పూర్తయితే రాయలసీమలో ప్రతి ఎకరాకూ నీరందిస్తామన్నారు. గత ప్రభుత్వ అసమర్థత కారణంగా రాయలసీమ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. సీఎం చంద్రబాబు రాకతో, రాయలసీమలో పలు పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయన్నారు. రాయలసీమను పారిశ్రామిక హబ్ గా, హర్టీకల్చర్ హబ్ గా అభివృద్ధి చేయానికి సీఎం చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. 


*త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీ*


గడిచిన ఎన్నికల్లో కూటమి విజయంలో కార్యకర్తల కృషి మరువలేనిదని మంత్రి సవిత కొనియాడారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఇస్తామన్నారు. త్వరలోనే  నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని, ఇప్పటికే ఈ దిశగా మంత్రి నారా లోకేశ్ చర్యలు ప్రారంభించారని వెల్లడించారు. గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులపైనా బనాయించిన అక్రమ కేసుల మాఫీపైనా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యకర్తల పార్టీ టీడీపీ అని అన్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించి మహానాడు విజయవంతానికి జిల్లా టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీకే పార్థసారధి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె సింధూరరెడ్డి, ఎమ్మెస్ రాజు, కందికుంట వెంకటప్రసాద్, మాజీ మంత్రలు ఎన్. కృష్ణప్ప, పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, టీడీపీ జిల్లా అధ్యక్షులు అంజనప్ప, నాయకులు పరిటాల శ్రీరామ్, జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతకుముందు మినీ మహానాడు ప్రారంభం సందర్భంగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి సవిత సహా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. టీడీపీ జెండాను మంత్రి సవిత ఆవిష్కరించారు.



Comments