శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి);
*జగన్మాత సన్నిధిలో భక్తుల రద్దీ
*
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ కనక దుర్గమ్మ వారి దర్శనం కోసం అమావాస్యను పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు.
చండీ హోమంలో భక్తులు పాల్గొన్నారు.
రాహువును నియంత్రించే అధి దేవత అయిన శ్రీ దుర్గమ్మను వేడుకోవడానికి మంగళవారం సాయంత్రం రాహు కాలం సమయంలో పలు ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి,అమ్మవారిని దర్శించుకుని రాహు కాల పూజల్లో పాల్గొన్నారు.
మహిమాన్విత ఇంద్రకీలాద్రిని పరిశుభ్రతగా ఉంచేందుకు గానూ పారిశుద్యం మెరుగు పర్చేందుకు, ఉచితంగా అవకాశం కల్పించినా, భక్తులు పాదరక్షలు ఎక్కడ బడితే అక్కడ విడిచి పెడుతుండటంతో ఆ సమస్య పరిష్కారంకి తగు సూచనలు ఇవ్వవలసినదిగా ఆలయ కార్యనిర్వహణాధికారి వీ. కే.శీనానాయక్ ఈరోజు ఒక కమిటీ నియమించారు.
ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కెవి ఎస్ ఆర్ కోటేశ్వరరావు,డీ. ఈఈ వి. రవీంద్రనాధ్ ఠాగూర్,ఏ ఈవో ఎన్. రమేష్ బాబు, సూపరెండెంట్ సి హెచ్ వి. నరసింహరాజు అనే ఈ సభ్యులు 7రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
addComments
Post a Comment