విజయవాడ (ప్రజా అమరావతి);
*• దేశీయ జల మార్గాలు జల రవాణాకు అనుకూలం
*
*• జల రవాణా రోడ్డు, రైల్ రవాణా కంటే ఖర్చు తక్కువ*
*• పోర్టుల అనుసంధానంతో యువతకు మరిన్ని ఉద్యోగాలు*
*• దేశ ఆర్థిక వ్యవస్థలో జల రవాణా కీలక పాత్ర వహిస్తుంది*
*• జల రవాణాలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి*
*- డాక్టర్. జెడ్. శివప్రసాద్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ దేశీయ జల మార్గముల ప్రాధికార సంస్థ*
రాష్ట్రంలో జల మార్గాల అనుసంధానంతో జల రవాణా సులభతరం అవుతుందని అందుకు నా వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ దేశీయ జల మార్గముల ప్రాధికార సంస్థ చైర్మన్ జెడ్. శివప్రసాద్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ దేశీయ జల మార్గముల ప్రాధికార సంస్థ చైర్మన్ గా డాక్టర్ జెడ్. శివప్రసాద్ శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో సంస్థ కార్యాలయంలో సంస్థ సీఈవో జీవీ. రాఘవరావు సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విజనరీ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నాకు మార్గదర్శి ఐటీ, విద్యా శాఖ ల మంత్రి నారా లోకేష్ లు నా మీద నమ్మకంతో ఈ బాధ్యతలు ఇవ్వటం సంతోషంగా ఉందని, అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. జల రవాణా లాంటి మంచి ప్రాజెక్టు బాధ్యతలను నాకు ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు. నా శక్తి వంచన లేకుండా ఇందుకు పనిచేస్తానన్నారు. తక్కువ ఖర్చుతో దేశీయ జల మార్గం ద్వారా రవాణా, కార్గో చాలా సులభతరం అవతుందన్నారు. జల మార్గంతో రవాణా చేయడం వల్ల రోడ్లపై ట్రాఫిక్ తగ్గుతుందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
రాష్ట్రంలో 960 కి.మీ ల పొడవు గల సముద్ర తీర ప్రాంతం ఉందని జల రవాణాకు ఇది ఎంతో అనుకూలమన్నారు. కృష్ణా, గోదావరి, పెన్నా నదుల అనుసంధానంతో జల రవాణా కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. దీనివల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్నారు. సాగరమాల ప్రాజెక్టుకు అనుసంధానం చేసే కార్యక్రమాలు చేపడతామన్నారు. పాశ్చాత్య దేశాలు జల రవాణాపై ప్రత్యేక ధృష్టి పెట్టాయన్నారు. జల రవాణాలో ఉన్న ఇబ్బందులను తొలగించి సంస్థను పురోభివృద్దిలో పయనించేలా కృషి చేస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. రవాణా శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ప్రోత్సాహంతో సంస్థను ముందుకు తీసుకెళ్లతామన్నారు. పోర్టు లు అనుసంధానం ద్వారా మరిన్ని ఉద్యోగాలు యువత కు లభిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీని పై దృష్టి పెట్టటం సంతోషంగా ఉందన్నారు. జల రవాణా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వానికి నావంతు సహకారం అందిస్తానన్నారు.. జల రవాణాలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని డాక్టర్. జెడ్. శివప్రసాద్ తెలియజేశారు..
addComments
Post a Comment