🔹ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి.
🔹డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి.
🔹జూన్ 2 లోపు పైలట్ మండలాల్లో దరఖాస్తులన్నింటికి పరిష్కారం చూపాలి.
🔹ఎదులాపురం మునిసిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి.
- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
హైద్రాబాద్ (ప్రజా అమరావతి);
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇండ్లు,
భూ భారతి, ఏదులాపురం మునిసిపాలిటీ అభివృద్ధి పైజిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను అధికారులు చిత్తశుద్ధితో పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడతగా ప్రతి మండలంలోని ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి జిల్లా వ్యాప్తంగా 875 ఇండ్లు మంజూరు చేసామన్నారు. అందులో 475 ఇండ్లు గ్రౌండింగ్, 420 కి పైగా బేస్మెంట్ లెవల్ పూర్తి చేయగా మొదటి విడత లక్ష రూపాయలు మంజూరు చేశామన్నారు. ప్రస్తుతం ఇండ్లు కట్టుకొవడానికి సిద్ధంగా లేని వారి నుండి అంగీకారం తీసుకొని అర్హులైన మరొకరికి మంజూరుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
డ్వాక్రా ద్వారా రుణాలు అవసరమయ్యే వారికి అందించాలని, డ్రాప్ అయ్యే వారిని రెండో విడతలో కేటాయించాలని అన్నారు. .
రెండో విడత నియోజకవర్గానికి 3500 ఇండ్లు కేటాయించగా, జిల్లాకు 17983 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు లక్ష్యం కేటాయించామన్నారు. 12276 ఇండ్లకు సంబంధిత నియోజకవర్గాల నుండి మంజూరు కు ప్రతిపాదనలు రాగా ఇప్పటివరకు 7212 ఇండ్లు ఇంచార్జ్ మంత్రివర్యుల ఆమోదం పొంది, జాబితా అందిందన్నారు.
డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించి, లబ్ధిదారుల జాబితా వచ్చే నెల మొదటి వారంలో పూర్తి చేయాలన్నారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు విధి విధానాలు ఖచ్చితంగా అమలు పర్చాలన్నారు. కడు పేదవారు, ఇండ్ల స్థలం లేనివారిని ఎంపిక చేయాలన్నారు.
భూ భారతి-2025 క్రింద ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. పైలట్ ప్రాజెక్ట్ క్రింద జిల్లాలోని నేలకొండపల్లి మండలాన్ని ఎంపిక చేసి, మండలంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించామన్నారు. రెండో విడతగా జిల్లాలోని బోనకల్ మండలంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామన్నారు.
నేలకొండపల్లి మండలంలో రెవెన్యూ సదస్సుల ద్వారా 3264 దరఖాస్తులు స్వీకరించగా, అందులో 1786 సాదా బైనామా దరఖాస్తులు ఉన్నట్లు తెలిపారు. కోర్ట్ నుండి సాదా బైనామా విషయమై కేస్ వెకేట్ కాగానే, దరఖాస్తులు పరిష్కారం చేసేలా విచారణలు, సర్వేలు పూర్తిచేసి, సిద్ధం చేయాలన్నారు. అసైన్డ్ భూముల్లో ఉన్న పేదవారికి పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సిసిఎల్ఏ నుండి ఏలాంటి ఉత్తర్వులు కావాలన్న సమాచారం ఇవ్వాలన్నారు.
జిల్లాలోని ఎర్రుపాలెం మండలం మూలుగుమాడును రీ సర్వే కి పైలట్ గ్రామంగా ఎంపిక చేశామన్నారు. పైలట్ గ్రామంలో రీ సర్వే పూర్తిచేస్తే, భవిష్యత్తులో రాష్ట్ర మంతటికి రీ సర్వే కి సమస్యలు విషయమై క్లారిటీ వస్తుందన్నారు. రీ సర్వే లో ప్రజల ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని, రీ సర్వే తో నక్ష తయారుతో మంచి జరుగుతుందా, సమస్యలు పరిష్కారం అవుతున్నాయా అనే వాస్తవ నివేదిక సమర్పించాలన్నారు.
జూన్ 2 నుండి అన్ని మండలాల్లో సర్వేకి, మండలానికి 2 టీములు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో 465 మంది లైసెన్స్ సర్వేయర్లకు దరఖాస్తు చేశారని, రిటైర్, ప్రస్తుత సర్వేయర్లతో వీరందరికి శిక్షణ ఇవ్వాలన్నారు. శిక్షణ సోమవారం నుండి ప్రారంభించాలని, శిక్షణకు జిల్లాలో పక్కా ప్రణాళిక చేయాలన్నారు.
ఏదులాపురం మునిసిపాలిటీ ని ఆదర్శంగా తీర్చిదిద్దేoదుకు చేపట్టాల్సిన పనుల విషయమై ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. మునిసిపాలిటీలో 32 వార్డులు 60 వేల జనాభా ఉందన్నారు. పారిశుద్ధ్యం, పెండింగ్ బిల్లులు, అనుమతులపై దృష్టి పెట్టాలన్నారు. వ్యర్థాల నుండి ఆదాయం సమకూరే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కావాల్సిన సిబ్బంది ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ భూమిని గుర్తించి, రక్షణ చేయాలన్నారు. త్రాగునీటి, రోడ్లు, సదుపాయాల, హై టెన్షన్ వైర్ల తరలింపునకు చర్యలు తీసుకోవాలని అన్నారు. తీగల వంతెన నిర్మాణంలో ఇండ్లు కోల్పోయిన 28 మంది పేదవారికి ప్రత్యామ్నాయ స్థలం చూపాలన్నారు. మునిసిపాలిటీ ని అందంగా తీర్చిదిద్ధేందుకు ప్రణాళిక చేయాలన్నారు.
ఈ సమీక్ష లో అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులు, ఆర్డీవోలు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారులు,ఏడి (సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్), మున్సిపల్ కమీషనర్, తహశీల్దార్లు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment