*బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
*
* ఇన్చార్జి మంత్రి సవిత
* చిన్నారి హత్యాచార ఘటనపై మంత్రి తీవ్ర ఆగ్రహం
* నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని వెల్లడి
** రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంపైనా విచారం*
* గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేస్తున్నాం : మంత్రి సవిత
కడప (ప్రజా అమరావతి): జిల్లాలోని సీకే దిన్నెమండలం గువ్వల చెరువు ఘాట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే, ఎస్పీ అశోక్ కుమార్ తో మంత్రి సవిత ఫోన్ లో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. సీకే దిన్నెమండలం గువ్వల చెరువు ఘాట్ వద్ద కారును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలవ్వడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని మంత్రి సవిత వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గాయపడిన మరో ముగ్గురికి మెరుగైన చికిత్స అందజేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేగవంతమైన ప్రయాణాలతో ప్రాణాలకు ముప్పు కులుగుతుందని, దీనివల్ల కుటుంబాలు రోడ్డునపడే ప్రమాదముందని తెలిపారు. మలుపుల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు నియమాలు పాటించాలని తెలిపారు. పోలీసు అధికారులు ప్రమాదాలపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆ ప్రకనటలో మంత్రి సవిత తెలిపారు.
*చిన్నారి హత్యాచార ఘటనపై తీవ్ర ఆగ్రహం*
కడప జిల్లా మైలవరం మండలం ఏ.కంబాల దిన్నెలో మూడేళ్ల చిన్నారి హత్యాచార ఘటనపై జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై నిందితుడు రహమతుల్లా మృగంలా ప్రవర్తించడం దారుణమన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ అశోక్ కుమార్ కు ఫోన్లో మంత్రి సవిత ఆదేశించారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపిన మంత్రి, ప్రభుత్వపరంగా అండగా ఉంటామన్నారు. క్షమించరాని నేరం చేసిన నిందితుడు రహమతుల్లాను చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామన్నారు. భవిష్యత్తులో మరెవరైనా మహిళలు, చిన్నారుల పట్ల అనుచితంగా ప్రవర్తించకుండా ఉండేలా కఠినకంగా వ్యవహరిస్తామన్నారు.
addComments
Post a Comment