రైతు సదస్సు మరియు వ్యవసాయ ప్రదర్శన.

 రైతు సదస్సు మరియు వ్యవసాయ ప్రదర్శన.



 కొల్లిపర (ప్రజా అమరావతి);

అత్తోట గ్రామంలో గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలోని వ్యవసాయ కళాశాల, బాపట్ల విద్యార్థినులు ఏరువాక కేంద్రం లాం గుంటూరు వారి ఆధ్వర్యంలో  రైతు సదస్సు మరియు వ్యవసాయ ప్రదర్శన నిర్వహించారు. ఈ వ్యవసాయ ప్రదర్శనలో విద్యార్థినులు తయారు చేసిన నమూనాలను, చార్ట్ లను వివిధ పంటల సమస్యల మీద తయారు చేసి ప్రదర్శించటం జరిగినది.

   రైతు సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. పి సుజాత, ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లాo వారు అధ్యక్షత వహించారు. ఈ రైతు సదస్సులో గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమం గురించి డా. ఎన్ వెంకట లక్ష్మి కో ఆర్డినేటర్ ఏరువాక కేంద్రం లాం వారు వివరించారు. ఈ సదస్సులో రైతుల సందేహాలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. సి సంధ్య రాణి ప్రధాన శాస్త్రవేత్త కీటక శాస్త్రం, డా. డయాన గ్రీస్, డా. సి హెచ్ సుజని రావు, డా. ఎమ్ వెంకట రాములు సమాధానాలు తెలియచేశారు. ఈ కార్యక్రమం లో రావెప్ విద్యార్థినులు మరియు వారి రైతులు వారి అనుభవాలూ తెలియచేశారు.

 ఈ రైతు సదస్సులో అత్తోట గ్రామ వ్యవసాయ సహాయకులు బి.సాయి కృష్ణ, నంది వెలుగు గ్రామ వ్యవసాయ సహాయకులు యు. శివ సాయి తేజ మరియు అభ్యుదయ రైతులు యెర్రు వెంకయ్య నాయుడు,ఏర్రు వేంకటేశ్వర రావు, ఎస్ రవి ప్రసాద్, వై. బాపరావు, ఎన్. రోశయ్య, కే. సాంబశివరావు తో పాటు నందివెలుగు, కొలకలూరు, కట్టెవరం, ఉప్పల పాడు మరియు అత్తోట రైతులు పాల్గొన్నారు.

Comments