*సీఎం సహాయ నిధి...పేదలకు పెన్నిధి: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*
*నియోజకవర్గ పరిధిలోని 15బాధిత కుటుంబాలకు....రూ.8 లక్షల 49వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే*
*ఎమ్మెల్యే రాముకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు...*
*కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో... కోటిన్నర సీఎంఆర్ చెక్కులు పేదలకు అందించాం*
గుడివాడ మే 24 (ప్రజా అమరావతి): సీఎం రిలీఫ్ ఫండ్ నిధి.. కష్టాల్లో ఉన్న పేదలకు పెన్నిధి వంటిదని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు.
గుడివాడ టిడిపి కార్యాలయం (ప్రజా వేదిక)లో .... నియోజకవర్గ పరిధిలోని 15బాధిత కుటుంబాలకు, 8 లక్షల,49 వేల, 063 రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రాము శనివారం సాయంత్రం పంపిణీ చేశారు
ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే రాము మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న రోజుల వ్యవధిలో చెక్కులు రావడంతో లబ్ధిదారులు హార్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మీడియాతో మాట్లాడారు....ఆపద సమయంలో అత్యవసరంగా అప్పు చేసి వైద్యం చేయించుకున్న పేదలకు రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తుంది అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఏ ఒక్కరు వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదని ఆశయంతో నా వంతు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది ఎవరిలో నియోజకవర్గ పరిధిలోని బాధ్యత కుటుంబాలకు కోటిన్నర సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు.
ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ప్రైవేటు వైద్యశాలలో లక్షలు ఖర్చుచేసి వైద్యం చేయించుకున్న లబ్ధిదారులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.గుండెజబ్బు వస్తే రూ.60వేలు విలువైన ఇంజక్షన్ను గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్ లో ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. జగన్ ఆర్థిక అరాచకాలు సృష్టించి, అప్పులు చేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని విమర్శించారు. కష్టమైనా అభివృద్ధి, సంక్షేమం దిశగా చంద్రబాబు పాలన అందిస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ టిడిపి అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవి, ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్,టిడిపి నాయకులు లింగం ప్రసాద్, కంచర్ల సుధాకర్, పెద్దు వీరభద్రరావు, కొడాలి రామరాజు, చేకూరు జగన్ మోహన్ రావు,పండ్రాజు సాంబయ్య, వసంతవాడ దుర్గారావు, దాసు శ్యాంప్రసాద్, అల్లాడ శ్రీనివాసరావు, కైలే సుబ్బారావు, పలువురు కూటమి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment