గుంటూరు 24 మే 2025 (ప్రజా అమరావతి)
:- శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేసేలా సంబంధిత శాఖలు సమన్వయంతో ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ భార్గవ్ తేజ ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్లోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ భార్గవ్ తేజ నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్ తో కలిసి శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులపై ఆర్ అండ్ బి, మున్సిపల్ , పోలీస్ , రైల్వే , విద్యుత్ , బిఎస్ఎన్ఎల్, నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ భార్గవ్ తేజ మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులకు సంబంధించి పిల్లర్ల నిర్మాణ పనులు రెండు వారాల్లో ప్రారంభించేలా నిర్మాణ ఏజెన్సీని సమన్వయం చేసుకుంటూ మున్సిపల్ ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణ ఏజెన్సీకి హిందూ కళాశాల వైపు, లాడ్జి సెంటర్ వైపు ఫ్రీ కాస్ట్ మెటీరియల్ సిద్ధం చేసుకోవడానికి గుర్తించిన స్థలాలను మరోసారి పరిశీలించి మంగళవారం నాటికి వివరాలు తెలియచేయాలన్నారు. ఆర్ఓబీ నిర్మాణా ప్రాంతంలోని విద్యుత్ స్తంభాలను పక్కకు తరలింపుకు మరోసారి విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి ఎస్టిమేషన్లను మున్సిపల్ శాఖకు అందించాలన్నారు. ఆర్ఓబీ పనులు సజావుగా కొనసాగేలా సంబంధిత శాఖలు నిర్మాణ ఏజెన్సీతో నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో డిఆర్ఓ ఎన్ఎస్ కె ఖాజావలి, కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి ఓ ఎస్ డి రూప్ కుమార్, ట్రాఫిక్ డిఎస్పి రమేష్ బాబు నగరపాలక సంస్థ ఎస్ఈ నాగమల్లేశ్వరరావు,ఆర్ అండ్ బి ఈఈ సమర్పణ రావు, విద్యుత్ శాఖ ఈఈ నాగేశ్వరరావు , రైల్వే డిఈ భరత్, బిఎస్ఎన్ఎల్ డిఈలు రఘురాం, నాగరాజు, ట్రాఫిక్ సిఐలు అశోక్ కుమార్ , సింగయ్య , నిర్మాణ ఏజెన్సీ లక్ష్మణ్ ఇనఫ్రా వైస్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment