ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిస్కరించాలి.

గుంటూరు 26 మే 2025 (ప్రజా అమరావతి ):-  ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు అందించేమది ది చాలా నిరుపేద కుటుంబాల వారని , ఎక్కువగా భూ సమస్యలు , స్థానిక సమస్యలు , ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సంబంధించి అర్జీలు అందించడం జరుగుతుందని , వారు అందించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిస్కరించాలని


కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్ర శేఖర్ ఆదేశించారు.  


  సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్ర శేఖర్ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, డిప్యూటీ కలెక్టర్లు  గంగరాజు , లక్ష్మీ కుమారి , డిఆర్ఓ ఎన్.ఎస్.కే.ఖాజావలి , స్టెఫ్ సిఇఓ ఆర్. చంద్రముని , ఆర్డిఓ శ్రీనివాస రావు ప్రజల నుండి 222 అర్జీలను స్వీకరించారు.  ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం అధికారులతో కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్ర శేఖర్  మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు అందించడానికి వచ్చిన అర్జీదారులతో మంత్రి వర్యులు స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని అర్జీదారుల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్ర శేఖర్  మీడియా వారితో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా  సమస్యల పరిష్కార వేదికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నదన్నారు.  ఎక్కువగా భూ సమస్యలకు సంబంధించిన పిర్యాదులు వస్తున్నాయని , గ్రీవెన్స్ కు వచ్చిన పిర్యాదులు అన్నింటిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. మరొక సారి కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంపై  అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు.  అర్జీదారులను మళ్ళీ మళ్ళీ కార్యాలయాలకు తిప్పించుకోవడం మంచి పద్దతి కాదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రి గారికి ఎన్ని అర్జీలు వచ్చాయో , ప్రజా వేదికలో ఎన్ని అర్జీలు వచ్చాయో , రీ సర్వే , గ్రామ సభల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎన్ని అర్జీలు వచ్చాయో డేటా వుందని , వచ్చిన అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ప్రజల్లో సంతృప్తి శాతం తక్కువగా వుందని , దానిని పెంచేలా చూడాలన్నారు. 




దివ్యాంగుల చెంతకే వెళ్ళి అర్జీలు స్వీకరించిన మంత్రి వర్యులు డా. పెమ్మసాని చంద్ర శేఖర్ :- 


  ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు అందించానికి వచ్చిన దివ్యాంగుల చెంతకే కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్ర శేఖర్ స్వయంగా వెళ్ళి అర్జీలు స్వీకరించారు.  గుజ్జనగుండ్లకు చెందిన క్రిష్ణ  కుమారి తన కూతురు రాధిక 90 శాతం వికలాంగురాలని , మెడికల్ బోర్డు మంజూరు చేసిన సదరన్ సర్టిఫికేట్ వుందని , ఇంటికి రెండు మీటర్లు ఉన్న కారణంతో  గతంలో వచ్చే దివ్యాంగుల ఫించన్ నిలుపుదల చేయడం జరిగిందని , తొలగించిన ఫించన్ ను పునరుద్దరించాలని కోరారు.  అలాగే విభిన్న ప్రతిభావంతుల ఆదరణ సేవా సంస్థకు చెందిన విభిన్న ప్రతిభవంతుల నుండి మంత్రి వర్యులు అర్జీలను స్వీకరించారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ లో వున్న వసతి గృహాన్ని తనిఖీ చేయాలని , జిల్లాలో 2016 వికాలాంగుల చట్టం అమలు కావడం లేదని , చట్టం అమలు అయ్యేలా చూడాలన్నారు.  విభిన్న ప్రతిభావంతులకు అన్ని కార్యాలయాల్లో స్పెషల్ గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు.  దివ్యాంగులు అందించిన పిర్యాదులపై మంత్రి వర్యులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


  జిల్లా ఇన్చార్జ్  కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఇకపై గోల్డెన్ డే గా నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.  పీజీఆర్ఎస్ లో అందిన అర్జీలను గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలన్నారు.  పిటీషన్లు  బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్ళకుండా ముందుగా పరిష్కరించాలన్నారు. శాఖల వారీగా పెండింగ్ దరఖాస్తులను ఇన్చార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ సమీక్షించి సూచనలు చేసారు. అర్జీలపై ఎండార్స్ మెంట్ జాగ్రత్తగా చేయాలని , ఫిర్యాదుల పరిష్కారాన్ని ఎట్టి పరిస్థితిలో గడువులోగా పరిష్కరించాలన్నారు.  జిల్లా సంతృప్తి స్థాయిలో 15 వ స్థానంలో వెనుకబడి వుందని , అర్జీల పరిష్కారంలో సమయపాలన పాటిస్తూ నాణ్యతగ పరిష్కరించినపుడే సంతృప్తి స్థాయి పెరుగుతుందన్నారు. అనంతరం అర్జీలు అందించడానికి వచ్చిన  దివ్యాంగుల వద్దకు జిల్లా ఇన్ ఛార్జీ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ స్వయంగా వెళ్ళి అర్జీలను స్వీకరించి , వారి సమస్యలను పరిష్కరించాలని  సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. 

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జెడ్పి సిఇఓ జ్యోతిబసు , డ్వామా , డీఆర్డీఏ ,  హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లు శంకర్, విజయలక్ష్మీ , ప్రసాద్ , డిపిఓ బి.వి.నాగ సాయి కుమార్ , ఎస్.ఈ పంచాయితీ రాజ్ బ్రహ్మయ్య , డిఎస్ డబ్ల్యూ ఎస్ మోహన్ , జిల్లా వ్యవసాయ అధికారి                             ఎన్. వెంకటేశ్వర్లు , జిల్లా ఉద్యాన శాఖ  అధికారి రవీంద్ర ,  సిపిఓ శేషశ్రీ , డియం అండ్ హెచ్ ఓ                 డా. విజయలక్ష్మీ , ఎల్ డి ఎం మహిపాల్ రెడ్డి తదితర శాఖల  జిల్లా అధికారులు పాల్గొన్నారు.  


Comments