వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యమే..

 *వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యమే..


*

- *దేశానికి, తమిళనాడుకు ఇదేమీ కొత్త కాదు*

-  *చెన్నైలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్..*


చెన్నై  (ప్రజా అమరావతి);

         తమిళనాడు బిజెపి ఆధ్వర్యంలో 'ఒకే దేశం, ఒకే ఎన్నిక'  విధానంపై చర్చాగోష్టిని చెన్నై తిరువాన్మియూర్‌లోని రామచంద్ర కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో తమిళనాడు బిజెపి అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌తో సహా బిజెపి ప్రముఖులతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 1952-67 వరకు దేశంలో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ల వల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగదని ఆయన స్పష్టం చేశారు. అందుకు ఉదాహరణే గత రెండు ఎన్నికలలో ఏపీ, తెలంగాణ ప్రాంతీయ పార్టీలు గెలుస్తున్నాయని వివరించారు.

తెలంగాణలో టీఆర్ఎస్ వరుసగా రెండు సార్లు

గెలిచిందన్నారు. ఏపీలో 2014 టీడీపీ, 2019లో మరో పార్టీ

గెలిచిందని.. గత ఎన్నికలలో కూటమీ ప్రభుత్వం ఎంపీ, అసెంబ్లీలో ఎన్నికలలో గెలిచిందన్నారు. ఆ గెలుపునకు ప్రాంతీయపార్టీలే కీలకంగా మారాయన్నారు ఒడిస్సా, తెలంగాణలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, అక్కడ

బీజేపీ లబ్ధి పొందలేదు.. ఆశించినంత గెలవలేదు కదా..?అని ప్రశ్నించారు. ప్రస్తుతం, ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందని డీఎంకే చెప్పడం విడ్డురంగా ఉందన్నారు..


*స్టాలిన్ వ్యతిరేకతకు అర్ధం ఏంటో..?:*

ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని కరుణానిధి మద్దతు ఇచ్చారు. కానీ స్టాలిన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో తమిళంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తమిళ దేవుడు మురుగ స్వస్థలం తమిళనాడు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తమిళంలో మాట్లాడుతూ, ‘’నేను పూజించే తమిళ దేవుడు మురుగ స్వస్థలం, మహాకవి స్వస్థలం, సిద్ధుల స్వస్థలం, నాకు చాలా ఇష్టమైన ఎంజిఆర్ స్వస్థలం. తమిళనాడుపై నాకు ఎప్పుడూ గౌరవం ఉంది'' అని అన్నారు.ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మద్దతు ఇచ్చారు. కానీ ఆయన కుమారుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తున్నవారు కరుణానిధి రాసిన 'నేంజుక్కు నీతి' పుస్తకం చదవాలి. ఎందుకంటే కరుణానిధి ఆ పుస్తకంలో ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’కు మద్దతు ఇచ్చినట్లు రాశారు'' అని పవన్ కల్యాణ్ అన్నారు.


*ఒకే దేశం ఒకే ఎన్నికపై తప్పుడు సమాచారం:*


''ఒకే దేశం ఒకే ఎన్నికపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందని..కొందరు దీనిపై ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం తీసుకొచ్చి ఉంటే మద్దతు ఇచ్చేవారు. గెలిస్తే ఈవీఎం సూపర్ అని, ఓడిపోతే అక్రమాలు జరిగాయని అంటున్నారు'' అని ఆయన అన్నారు.


*ఒకే దేశం ఒకే ఎన్నికతో ప్రయోజనాలు*:


ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుతూ, ''తరచుగా ఎన్నికలు జరగడం వల్ల మన దేశం ఎన్నికల పనుల్లోనే కూరుకుపోతోంది. అధికారులు, పోలీసులు, ఉపాధ్యాయులు నిరంతరం పనిచేయాల్సి వస్తోంది. ఎన్నికల ఖర్చుల వల్ల ప్రజా సంక్షేమ పథకాల అమలులో జాప్యం జరుగుతోంది. ఒకే దేశం ఒకే ఎన్నిక ద్వారా ఎన్నికల ఖర్చు తగ్గించవచ్చు. ప్రజలకు మరిన్ని పథకాలు అమలు చేయవచ్చు'' అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జాతీయ కన్వీనర్ అనిల్ ఆంథోనీ, బీజేపీ తమిళనాడు నేతలు అర్జున మూర్తి, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


Comments