జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయించిన సరఫరా చేసిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వెల్లడి.


కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా  (ప్రజా అమరావతి);



 *60 లక్షలు విలువ చేసే 20 క్వింటాళ్ల ప్రభుత్వ నిషేధిత నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం :  కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్* 


 *జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయించిన సరఫరా చేసిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ  వెల్లడి


*

 

 *భారీ మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనపరుచుకోవడంలో ముఖ్యపాత్ర పోషించిన టాస్క్ ఫోర్స్ అధికారులు మరియు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ* 


కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 60 లక్షల విలువచేసే 20 క్వింటల్లా నకిలీ పత్తి విత్తనాలు జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్ స్వాధీన పరుచుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు  కాగజ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు తెలిపారు. ఎస్పీ గారు ప్రెస్ మీట్ నందు తెలిపిన వివరాల ప్రకారం...  


కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు కాగాజ్నగర్ లో నివాసం ఉండే కొత్తపల్లి సదాశివ  అనే వ్యక్తి నకిలీ బీటీ విత్తనాలను జిల్లాలో అమ్ముతున్నడన్న సమాచారం మేరకు ఈ రోజు ఉదయం పెద్దవాగు దగ్గర అనుమానంగా వెళ్తున్న ఐచెర్ వ్యాన్  AP 39 TY 9741 ను ఆపి తనిఖీ చేయగా అందులో 20 క్వింటాళ్ల (సుమారు 60 లక్షలు విలువ )ప్రభుత్వ నిషేధిత నకిలీ బీటీ 3 రకం విత్తనాలను పట్టుకోవడం జరిగింది. కొత్తపల్లి సదశివ్ ను పట్టుకొని విచారించగా  కరీంనగర్ జిల్లా మర్రిగడ్డ కి చెందిన వేణుగోపాల్ రెడ్డి అనే అతను సంతోష్ ద్వారా ఒక వాహనం లో వస్తున్నాయి అని చెప్పినాడు.

సదశివ్ నకిలీ విత్తనాలను తీసుకోవడానికి వెళ్ళనప్పుడు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్, ఎస్ఐ వెంకటేష్ తమ సిబ్బంది తో ఐచేర్ వ్యాన్ ను ఆపి తనిఖీ చేయగా అందులో ప్రభుత్వ నిషేధిత నకిలీ బీటీ విత్తనాలను పట్టుకోవడం జరిగింది అందులో ఉన్న డ్రైవర్ పుప్పాల లక్ష్మన్ (కర్నూల్ జిల్లా),   వేణుగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు సంతోష్ తో కలసి కాగాజ్ నగర్ లో తీసుకొని వస్తున్న సమయం లో  జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్ వారిని అదుపులోకి తీసుకున్నారు. 


 *నిందితుల వివరాలు* 

A1: కొత్తపల్లి సదశివ్, కాగజ్ నగర్, కాపు వాడ

A2: పుప్పాల లక్ష్మణ్ ( డ్రైవర్), ఆంధ్ర ప్రదేశ్,కర్నూల్ జిల్లా, ఆదోని 

A3 : సంతోష్ కిషోర్, మహారాష్ట్ర, ఆహేరి ..,   పై ముగ్గురిని అరెస్టు చేయటం జరిగింది.


A4: వేణుగోపాల్ రెడ్డి, (రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలం, మర్రిగడ్డ)  పరారి లో ఉన్నట్లు, త్వరలో పట్టుకుంటామని ఎస్పి గారు తెలిపారు. ఇంతటి భారీ మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీన పరుచుకోవడంలో ముఖ్యపాత్ర పోషించిన జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.

జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు గాని, నకిలీ ఏ విత్తనాలైనా సరఫరా చేసే వారిపై జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని ఎస్పీ గారు హెచ్చరించారు. 


 ఈ ప్రెస్ మీట్ నందు  కాగజ్నగర్ డిఎస్పి రామానుజం, టాస్క్ స్పోర్ట్స్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, కాగజ్నగర్ రూరల్ సిఐ శ్రీనివాసరావు, టాస్క్ ఫోర్స్ ఎస్. ఐ వెంకటేష్, కాగజ్నగర్ రూరల్ ఎస్సై సందీప్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది మధు, రమేష్, మహమ్మద్, దేవేందర్, సంజీవ్, హోంగార్డ్ శేఖర్ , ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments