గుంటూరు 22 మే 2025 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్న నూతన సంస్కరణలకు అనుగుణంగా రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ పని చేస్తుంద
ని రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్ పర్సన్ పీతల సుజాత తెలిపారు.
గురువారం స్థానిక ఎన్టీఆర్ సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ (మహిళా ప్రాంగణం) లోని ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ కార్యాలయంలో రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్ పర్సన్ గా పీతల సుజాత రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో పదవి స్వీకారం చేశారు. తొలుత మహిళా ప్రాంగణం ఆవరణలోని మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి, శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్ పర్సన్ పీతల సుజాత పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్ పర్సన్ పీతల సుజాత కు పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్ పర్సన్ పీతల సుజాత విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్ పర్సన్ గా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కు, కూటమి నేతలు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందరేశ్వరికి హృదయ పూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని, ముఖ్యంగా మహిళల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో ప్రణాళిక ప్రకారం పని చేస్తున్నారన్నారు. రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ ద్వారా నిస్సహాయస్థితిలో ఉన్న మహిళలకు ఆదరణ కల్పించడంతోపాటు వారిని మంచి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దటానికి అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి పొందేలా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. గత 2014 - 19 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారధ్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం కూటమీ ప్రభుత్వంలోను మహిళలు స్వయంగా వారి కాళ్లపై వారు నిలబడేలా అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపట్టడానికి కృషి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తుందని అమ్మకు వందనం పథకం త్వరలోనే అమలు చేస్తున్నారని, మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నైపుణ్య శిక్షణతో పాటు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్ పర్సన్ పీతల సుజాత ను రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మజ, మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ రమణశ్రీ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి విజయలక్ష్మి, కృష్ణా జిల్లా మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ జుబేదా పర్వీన్, రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్ పర్సన్ పీతల సుజాత కుటుంబ సభ్యులు, తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
addComments
Post a Comment