అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి తో పనిచేస్తుంది.
ఖమ్మం (ప్రజా అమరావతి );
ఈరోజు ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పర్యటించి పలు రోడ్ల విస్తరణ, పాఠశాల అదనపు తరగతి గది నిర్మాణ పనులకు శంఖుస్థాపనలు చేయడం జరిగింది.
ముత్తగూడెం వద్ద 8 కోట్ల రూపాయలతో తిరుమలాయపాలెం నుండి తాలేసు తాండ వరకు రోడ్డును రెండు వరసల రోడ్డు గా అభివృద్ధి, ఎన్ఎస్పీ కెనాల్ పై హై లెవెల్ వంతెన నిర్మాణ పనులకు, ఎం.వి. పాలెం ప్రాధమిక పాఠశాలలో రూ. 13.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గది నిర్మాణ పనులకు, 14 కోట్ల రూపాయలతో పొన్నెకల్ నుండి పిట్టలవారిగూడెం రోడ్డు, రెండు వరసల రోడ్డుగా అభివృద్ధి పనులకు, కాచిరాజుగూడెం వద్ద రూ. 19 కోట్ల రూపాయలతో చింతపల్లి నుండి కాచిరాజుగుడెం వరకు రోడ్డును రెండు వరసల రహదారిగా అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశాను.
ఎం.వి. పాలెం ప్రాధమిక పాఠశాల వద్ద ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి, పనులు నాణ్యతతో, సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment