ధరణి చట్టాన్ని ప్రక్షాళన చేసి, ప్రజలు మెచ్చే విధంగా భూభారతి చట్టాన్ని తెచ్చామ.

 భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు అంశాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ప్రజల సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  అన్నారు. 


ఖమ్మం కలెక్టరేట్ లో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  మాట్లాడుతూ..

  హైదరాబాద్ (ప్రజా అమరావతి);

ధరణి చట్టాన్ని ప్రక్షాళన చేసి, ప్రజలు మెచ్చే విధంగా భూభారతి చట్టాన్ని తెచ్చామ


న్నారు. చట్టం విధి విధానాలపై ప్రజల్లో అవగాహన కొరకు మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు చేపట్టినట్లు, రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 29 జిల్లాల్లో ప్రత్యక్షంగా తాను పర్యటించినట్లు తెలిపారు. ఏ గ్రామం, ఏ ప్రాంతానికి వెళ్లిన ప్రజలు ధరణితో ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశానని అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు, ఆసాములు భూభారతి చట్టంపై సంతోషం వెల్లిబుచ్చారన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నామన్నారు. 


జిల్లాలోని నేలకొండపల్లి మండలాన్ని పైలట్ మండలంగా ఎంపిక చేసి, అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, దాదాపు 3200 దరఖాస్తులు స్వీకరించామన్నారు. దరఖాస్తుల్లో 50 శాతానికి పైగా సాదా బైనామా కి సంబంధించి ఉన్నాయని, కోర్ట్ లో సాదాబైనామా కి సంబంధించి కేస్ వెకేట్ కాగానే పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. జూన్ 2 నాటికి మొదటి విడత పైలట్ మండలాల అన్ని సమస్యలు, రెండో విడత 28 మండలాల్లో సత్వర పరిష్కార సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. సాగుయోగ్యమైన అసైన్డ్ భూముల్లో ఉన్న కడు పేదవారికి పట్టాలు ఇస్తామన్నారు.  


జూన్ 3 నుండి 20 వరకు భూభారతి చట్టం ద్వారా రెవెన్యూ సమస్యలు పరిష్కారించేందుకు అధికార యంత్రాంగం గ్రామాలకు వస్తుందన్నారు. ప్రతి భూ సమస్య పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధి తో పనిచేస్తారన్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం పేదవారికి ఇస్తుందని మంత్రి తెలిపారు. అందులో 1.95 లక్షల లబ్ధిదారులను ఇప్పటికే ఫైనల్ చేశామన్నారు. మిగతా 2.55 లక్షల లబ్ధిదారులను ఈ నెలాఖరుకు ఫైనల్ చేస్తామన్నారు. రాష్ట్రంలోని 9800 చెంచు, చెంచు ఉపకులాల కుటుంబాలన్నింటికి పూర్తిగా ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తామన్నారు. ఐటీడీఏ ప్రాంతాల్లోని గిరిజనులకు అదనంగా మరో 10 వేల ఇండ్లు ఇస్తామన్నారు. పైలట్ గా ప్రతి మండలం నుండి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి, 8 వేల ఇండ్లు నిర్మాణాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఇండ్లు ప్రారంభించిన వారికి మొదటి విడత పేమెంట్ అందజేశామన్నారు. ప్రతి సోమవారం పేమెంట్ చేపడుతున్నట్లు తెలిపారు. జూన్ 2 న కనీసం వేయి ఇండ్లు నిర్మాణం పూర్తి చేసి, ప్రారంభోత్సవం చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాబోయే 3-4 సంవత్సరాల్లో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అర్హులైన ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే అధికారులకు వేటు తప్పదని తెలిపారు.


లైసెన్స్‪డ్ సర్వేయర్లకు నోటిఫికేషన్ ఇస్తే, రాష్ట్ర వ్యాప్తంగా 10 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. 50 పనిదినాల్లో వీరికి శిక్షణ ఇచ్చి, అనంతరం పరీక్ష పెట్టి, ఉత్తీర్ణత పొందిన వారిని లైసెన్స్‪డ్ సర్వేయర్ గా గుర్తిస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో 458 లైసెన్స్‪డ్ సర్వేయర్ కి దరఖాస్తు చేశారన్నారు. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి, నిరుద్యోగ యువతకు ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా కార్యాచరణ చేస్తామన్నారు.


ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారైని నియమిస్తామని మంత్రి గారు తెలిపారు. గతంలో వీఆర్వో, వీఆర్ఏ లుగా పనిచేసిన వారి నుండి అప్షన్లు తీసికొని, వారికి ఈ నెల 27న పరీక్ష నిర్వహించి, ఉత్తీర్ణత పొందిన వారిని గ్రామ రెవెన్యూ అధికారిగా నియమిస్తామన్నారు.


రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా, వచ్చిన ఆదాయంతో అప్పులు కడుతూ, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కాస్త ఆలస్యమైన ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  తెలిపారు.



Comments