MDU ద్వారా సరుకులను పంపిణీ చేసే విధానాన్ని నిలిపివేత-
నేరుగా చౌక ధర దుకాణాల ద్వారా సరుకులను పంపిణీ-
ఫేజ్-3 లో గ్యాస్ రాయితీ లబ్దిదారులు ఖాతాలో జమ-
రాష్ట్ర ఆహార & పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్
అమరావతి (ప్రజా అమరావతి);
మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర ఆహార & పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ
ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబందించి ప్రస్తుతం అమల్లో ఉన్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల ద్వారా సరుకులను పంపిణీ చేసే విధానాన్ని నిలిపివేస్తూ, గతంలో మాదిరిగానే చౌక ధర దుకాణాల ద్వారా నేరుగా సరుకులను పంపిణీ చేసే విధానాన్ని పునరుద్ధరించేందుకు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
రేషన్ కార్డుదారులు ఇచ్చిన IVRS ఫీడ్బ్యాక్ ప్రకారం 25% మంది నిత్యావసర సరుకులు అందకపోవడం, 26% మంది MDU ఆపరేటర్లు అధిక ధరలు వసూలు చేయడం వంటి ఫిర్యాదులు చేశారు. అదనంగా, ప్రతి MDU మూడు FPS ప్రాంతాలను 15-17 రోజుల్లో మాత్రమే కవర్ చేయడం, వస్తువుల మళ్లింపు (288 కేసులు నమోదు), మరియు ఆపరేటర్ల కొరత (570 ఖాళీలు) వంటి సమస్యలు ఈ పథకం రద్దుకు కారణాలయ్యాయి. ఈ నిర్ణయం వలన ప్రభుత్వానికి రూ.353.81 కోట్లు ఆదా అవుతాయి.
గతంలో 29 వేల చౌఖ ధర దుఖాణాల ద్వారా సరుకులను పంపిణీ చేసే విధానం అమల్లో ఉండేది. గత ప్రభుత్వం ఈ విదానాన్ని స్వస్తి పలుకుతూ MDU వాహనాల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేసే విదానాన్ని అమలు పర్చింది. ఇందుకై 9,260 MDU వాహనాల కొనుగోలుకు రూ.1860 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. పైలెట్ ప్రాజెక్టుకోసం మరో రూ.200 కోట్లను వెచ్చించడం జరిగింది. అయితే ఈ వాహనాల వల్ల వినియోగ దారులకు ఎటు వంటి ప్రయోజనం కలుగకపోవడమే కాకుండా రైస్ స్మగ్లింగ్ కు దారితీయడం జరిగింది. వ్యాను ఆపరేటర్లపై దాదాపు 200 కేసులు బుక్ చేయడం జరిగింది. రైస్ స్మగ్లింగ్ లో వీరు భాగస్వాములు అయ్యారు. మూడు రోజుల్లోనే 93 శాతం రేషన్ పంపిణీ చేసినట్లు చూపిస్తున్నారు. కానీ వినియెగ దారులకు సరుకులు సరిగా అందడం లేదు. ఒక్కొక్క వాహనానికి నెలకు రూ.27 వేల కార్పొరేషన్ నుండి చెల్లించండ జరుగుచున్నది. అయితే 570 వ్యాన్లపై ఇప్పటి వరకూ ఎటు వంటి సమచారం ఉండటం లేదు
వ్యానుల వల్ల లబ్దిదారులు ఎందో ఇబ్బందులకు గురువుతున్నారు.రూ.385 కోట్లు వెచ్చించాల్సి వస్తున్నది. చౌకధర దుఖాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయడం వల్ల వినియోగదారులు ఎదో టైమ్ లో సరుకులు తీసుకునేవారు, అటు వంటి సౌకర్యం వాహనాల వల్ల వినియోగదారులు కోల్పోవడం జరిగింది. కాబట్టి జూన్ 1 నుండి చౌకధర దుఖాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయడం మొదలు పెడతాం. 65 సంవత్సరాలు పైబడిన వృత్తులకు, దివ్యాంగులకు డోర్ డెలివరీ చేస్తాము. రైస్ డైవర్షన్ ఈ విదానం వల్ల అగిపోతుంది. చౌకధర దుఖాణాల ద్వారా ఇతర సరుకులు కూడా అమ్ముకునే సౌకర్యాన్ని కల్పిస్తాము. ఎస్సీ,ఎస్టీ,బిసీ,ఇబిసి, తదితర కార్పొరేషన్ ల ద్వారా వాహనాలు పొందిన వారిలో ఎవరైతే 10 శాతం కట్టిన వారికి ఈ వాహనాలను ఉచితంగా అందజేయడం జరుగుతుంది.
దీపం-2 పథకం క్రింద మొదటి ఫేజ్ లో దాదాపు 99,700 మంది లబ్దిపొందాయ ఉచిత గ్యాస్ సిలిండర్ సౌకర్యాన్ని వినియోగించుకోవడం జరిగింది. దీపం-2 ఫేజ్ టూ అమల్లో బాగంగా ఇప్పటికే దాదాపు 70 లక్షల మంది ఉచిత గ్యాస్ సిలిండర్ కోసమై బుక్ చేసుకోవడం జరిగింది. ఫేజ్-3 లో ముందుగానే గ్యాస్ రాయితీ సొమ్మును లబ్దిదారులు ఖాతాలో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాము.
ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరబ్ గౌర్ పాల్గొన్నారు.
addComments
Post a Comment