రూ.4లక్షలు మోసం చేసిన వైసీపీ సర్పంచ్.

 


రూ.4లక్షలు మోసం చేసిన వైసీపీ సర్పంచ్


భూకబ్జాలు, అక్రమాలు, అధికార దౌర్జన్యాలపై ప్రజల వినతుల వెల్లువ

అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్


  అమరావతి (ప్రజా అమరావతి);


        నెల్లూరు జిల్లా, నెల్లూరు టౌన్‌కు చెందిన మహిళ జి. సంధ్య, ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో తన గోడును వెళ్లగక్కారు. చినతోపు గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్ లేబూరు మల్లిఖార్జున తన అవసరాల నిమిత్తం రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నారని, ఆ డబ్బును తిరిగి అడిగినందుకు అర్ధరాత్రి సమయంలో తన ఇద్దరు కొడుకులతో కలిసి తమ ఇంటికి వచ్చి తనపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్‌లకు ఆమె అర్జీ ఇచ్చారు. తనకు న్యాయం చేయడంతోపాటు, మల్లిఖార్జున వద్ద నుండి రావాల్సిన డబ్బు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.



అనకాపల్లి జిల్లా, యస్. రాయవరం మండలం, పిట్లపాలెం గ్రామానికి చెందిన పోలరౌతు రామునాయుడు గ్రామంలోని కొంతమంది రోడ్డును అక్రమంగా ఆక్రమించారని, ఆ విషయాన్ని ప్రశ్నించినందుకు తన కొడుకును, అల్లుడిని బెదిరిస్తున్నారని, తమపై తప్పుడు కేసులు పెట్టి దాడులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.


ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం మండలం, గురిజేపల్లి గ్రామానికి చెందిన లింగాల జయలక్ష్మీ తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన కారణంగా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించుకున్న ఇంటికి సంబంధించిన బిల్లులను ఆపేసి తీవ్రమైన ఇబ్బందికి గురిచేశారని ఈ ప్రభుత్వంలో తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.


తిరుపతి జిల్లా, రామచంద్రాపురం మండలం, లోకమాతపురం గ్రామానికి చెందిన కె. మైలమ్మ 1978లో ఉన్న భూమికి సంబంధించిన పట్టా ఇంటి నిర్మాణ సమయంలో మిస్ అయిందని ఆ భూమికి పట్టా మంజూరు చేయాలని నేతల్ని కోరారు.


కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్ మండలం, చొల్లంగిపేటకు చెందిన అయిల నరసింహమూర్తి తన మామగారు గిప్ట్ గా ఇచ్చిన భూమిని మైదు హరిబాబు అక్రమంగా ఆక్రమించారని, ఆ భూమిని తిరిగి పొందేందుకు అధికారులు, నేతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


కృష్ణా జిల్లా, గుడివాడ మండలం, బేతవోలు గ్రామానికి చెందిన గుర్రాల సుబ్బారావు తన కుమారైకి, అల్లుడితో విడాకులైన 5 సంవత్సరాలు అయినప్పటికీ, కోర్టు ఆదేశించిన మెయింటెనెన్స్ ఖర్చులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పారు. తన కుమారైకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


కర్నూలు జిల్లా, నందవరం మండలం, మెట్టసోమాపురం గ్రామానికి చెందిన ఈ. ఉరుకందు గౌడ్ తన పేరిట ఉన్న 4 సెంట్ల భూమిని అధికారులు ఆన్లైన్ రికార్డుల నుంచి తొలగించారని, తిరిగి తన పేరుతో నమోదు చేయించాలంటూ ఫిర్యాదు చేశారు.

Comments