నిడమర్రులో అంతర్జాతీయ ప్రమాణాలతో తొలి మోడల్ స్కూల్
సుమారు 15 కోట్లతో జెడ్పి హైస్కూల్ ప్రాంగణం లో వేగవంతంగా కొనసాగుతున్న అభివృద్ది పనులు
ఆధునాతన సౌకర్యాలతో భవనాలు, గ్రౌండ్
అగస్త్య ఫౌండషన్ ఆధ్వర్యంలో సైన్స్ ల్యాబ్ & పార్క్ నిర్మాణం
మంగళగిరి (ప్రజా అమరావతి): రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ ప్రతిపాదనలతో రాజధాని అమరావతి లొని మంగళగిరి మండలం నిడమర్రు జెడ్పి హైస్కూల్ ను రాష్ట్రంలొనే తొలి మోడల్ స్కూల్ గా ఎంపిక చేశారు.
నిడమర్రులో అంతర్జాతీయ ప్రమాణాలతో తొలి మోడల్ స్కూల్ కు ఆంకురార్పణ జరిగింది.
సుమారు 15 కోట్ల రూపాయలతో నిడమర్రు జెడ్పి హైస్కూల్ ప్రాంగణం లో అభివృద్ది పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.
ఆధునికత జొడించి, ఆధునాతన సౌకర్యాలతో భవనాలు, గ్రౌండ్ నిర్మాణాలు చేపట్టనున్నారు.
అగస్త్య ఫౌండషన్ ఆధ్వర్యంలో సైన్స్ ల్యాబ్ & పార్క్ నిర్మాణం జరుగనుంది.
మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మార్క్ చూపిస్తూ ఆయన ఆధ్వర్యంలో అభివృద్ది పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.
addComments
Post a Comment