మిస్ వరల్డ్ గా విజేతగా థాయ్ లాండ్ భామ!.

*మిస్ వరల్డ్ గా విజేతగా థాయ్ లాండ్ భామ!*







హైదరాబాద్. (ప్రజా అమరావతి);

హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలలో.. మిస్ థాయ్‌లాండ్ విజేతగా నిలిచి అందాల కిరీటాన్ని దక్కించుకుంది. ఓపల్ సుచాత చువాంగ్ శ్రీకి ఈ ప్రతిష్టాత్మక విజయం లభించింది. 


మిస్‌వరల్డ్ మొదటి రన్నర పగా మిస్ ఇథియోఫియా, రెండో రన్నరప్‌గా మిస్ పోలాండ్‌కు దక్కింది. ఈ పోటీలలో మిస్ ఇండియా నందిని గుప్తాకు నిరాశ ఎదురైంది. టాప్ 8లో స్థానం దక్కించుకోలేక పోవడంతో ఆమె నిష్క్రమించింది. 


ఇది భారత అభిమానులకు కొంత నిరాశ కలిగించినప్ప టికీ.. పోటీలలో అంతర్జా తీయ ప్రాతినిధ్యం బలంగా ఉంది.మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ దేశాల అందాల భామలు మిస్ వరల్డ్ టాప్ 8లో చోటు దక్కించుకున్నారు. 


ఆసియా ఖండం నుంచి థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్ సుందరీమణులు టాప్ 8కు అర్హత సాధించడం విశేషం. టాప్ 8 నుంచి టాప్ 4ను ఎంపిక చేసి, అందులో నుంచి థాయ్‌లాండ్ సుందరిని మిస్ వరల్డ్ 2025 విజేతగా ప్రకటించారు.


ఈ భారీ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, సినీ నటి ఖుష్బూ, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు. మిస్ వరల్డ్ విజేతకు రూ. 8.5 కోట్ల నగదు, 1770 వజ్రాల కిరీటం, మరియు ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర సౌకర్యం కల్పించనున్నారు. 


ఈ బహుమతులు విజేతకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటు, సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తాయి.

Comments