కొమ్మినేని అరెస్టు దుర్మార్గం.

 *ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ సంఘీభావం తెలియచేసిన వైసిపి ఇంచార్జ్ వేమారెడ్డి.*


*మంగళగిరి కోర్టుకు హాజరైన కొమ్మినేని శ్రీనివాసుని కోర్టు వద్ద కలిసే ప్రయత్నం చేశారు.* 


*వైసిపి పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి , మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని కలిసి కొమ్మినేని పై టిడిపి పార్టీ బనాయించిన  కేసులు పై చర్చించారు.*


*కొమ్మినేని అరెస్టు దుర్మార్గం


*

 మంగళగిరి (ప్రజా అమరావతి);

 సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు దుర్మార్గం, కక్షపూరితమని, సాక్షి మీడియాను టార్గెట్ చేసిన సీఎం చంద్రబాబు, నిజాయితీగా పని చేసే జర్నలిస్టును వేధించడం దారుణమని వైఎస్ఆర్సిపి *మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ధ్వజమెత్తారు*. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలతో 'సాక్షి'కి సంబంధం లేకపోయినా వైఎస్ జగన్ను, ఆయన సతీమణి భారతిని తిట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కూటమి పాలన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కొమ్మినేనిని అరెస్టు చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments