భూ కబ్జాలు.. వివిధ సమస్యలపై వెల్లువెత్తిన వినతులు.



*భూ కబ్జాలు.. వివిధ సమస్యలపై వెల్లువెత్తిన వినతులు*


*అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాంప్రసాద్*


 అమరావతి (ప్రజా అమరావతి);


      సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలానికి చెందిన  బి. శ్రీ లక్ష్మి గ్రివెన్స్ లో విజ్ఞప్తి చేస్తూ.. తన భర్త మరణించాడని అతని మరణాంతరం తనకు చెందాల్సిన ఆస్తిని దౌర్జన్యంగా వైసీపీ మాజీఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరులు బన్యాల ఆదినారాయణ, బన్యాల నరేష్ లు ఆక్రమించుకున్నారని.. వారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాంప్రసాద్ లకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు. 


పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన SK ఫిరోజ్ గ్రీవెన్స్ లో నేతలకు ఫిర్యాదు చేస్తూ.. గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అండతో సర్వే నెంబర్ 212లోని సిలింగ్ భూములను గాదిబండ నరసింహారెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి పేర్లతో అక్రమ రిజిస్ట్రేషన్  చేసుకున్నారని.. వాటిని రద్దు చేయాలని ఫిర్యాదు చేశాడు.

తిరుపతి జిల్లా బి.ఎన్ కండ్రిగ మండలం పుత్తూరి గ్రామంలో ఉన్న తమ భూమి ఆన్ లైన్ నందు డబుల్ ఎంట్రీ అయ్యిందని.. దాన్ని సరిచేయాలని కె. ఈశ్వరమ్మ నేడు గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు. 

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెల్వడం అడ్డరోడ్డు గ్రామస్తులు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ... తాము గత 50 సంవత్సరాల నుండి  అడ్డరోడ్డులోని తూర్పు చెరువు పక్కన నివాసం ఉంటున్నామని.. తమకు ఇంటి నెంబర్లు, కరెంట్ అన్ని ఉన్నా.. వైసీపీకి చెందిన కొంతమంది కక్షపూరితంగా తమకు నోటీసులు ఇప్పించి తమ ఇళ్లను పడగొట్టేందుకు చూస్తున్నారని..  దయ చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలానికి చెందిన నటుకుల గురవమ్మ గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ. త్రిపురవంలో తమకు సంబంధించిన భూమిని భుక్కా నాగేశ్వరరావు, భుక్కా నాయక్ అను అన్నదమ్ముళ్లు కబ్జా చేశారని.. దీనిపై విచారించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ప్రకాశం జిల్లా ఒంగోలు త్రోవకుంటకు చెందిన మండువ రమేష్  గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ స్వాధీనంలో ఉన్న భూమికి నకిలీ డాక్యుమెట్లు సృష్టించి ఒంగోలు వైసీపీకి చెందిన నగర కార్పొరేటర్ సయ్యద్ జలీల్,  అతని కుమారులు, మరో పదిమంది వచ్చి తమను బెదిరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం కొలతూరు గ్రామానికి చెందిన పి. విజయలక్ష్మి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమకు సంబంధించిన  భూమిని కబ్జాదారులు ఆక్రమించుకోవడమే కాకుండా.. తమను హెరాస్ చేస్తున్నారని.. దయ చేసి అధికారులు కలుగ చేసుకొని తమకు న్యాయం చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Comments