* గంజాయి వ్యాపారులు, డ్రగ్ డీలర్లు, బ్లేడ్ బ్యాచ్‌లకు జగన్‌ను గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందేమో*
*గంజాయి అమ్మడం, ఆడపిల్లలను వేధించడం నేరం కాదన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయి
*
*గతంలో మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టారు, ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యులు, నక్కా ఆనంద్ బాబు గారు జగన్ వైఖరిపై దుయ్యబట్టారు*
అమరావతి (ప్రజా అమరావతి);
మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని ప్రజలంటే జగన్ కి కోపం రోజురోజుకూ పెరిగిపోతోంది, ప్రజల పట్ల జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన అసహ్యం కలుగుతోంది. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి రౌడీ షీటర్లు, చైన్ స్నాచర్లు, బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి వ్యాపారులకు మద్దతు ఇవ్వడం ఏమిటి? సభ్య సమాజం ఏమనుకుంటుందనే కనీస ఆలోచన జగన్‌కు లేదు. సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు? జగన్‌కు రాజకీయ భవిష్యత్తు లేదు, ప్రజాసేవకు పనికిరాడు. గంజాయి, డ్రగ్ వ్యాపారులు, బ్లేడ్ బ్యాచ్‌లకు గౌరవ అధ్యక్షుడిగా జగన్‌ను నియమిస్తే సరిపోతుంది. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగింది. జగన్ సహచరులు, అనుచరులు, బంధువులు, మిత్రులు రాష్ట్రాన్ని దోచేశారు. కొందరు జైళ్లకు వెళ్తున్నారు. ఈ నేరాలకు సంబంధించిన ఆధారాలు అన్ని తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. తన పాలనలో జరిగిన నేరాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు జగన్ చౌకబారు ఎత్తుగడలు వేస్తున్నాడు. పోలీసులపై హత్యాయత్నం చేస్తే వారిని సమర్థించాడు. తెనాలిలో పోలీసులు వల్ల పెద్ద నేరం జరిగినట్లు మాట్లాడి, రౌడీలను పొగడడం జగన్‌కు సంస్కారం లేని తనాన్ని చూపిస్తుంది. గంజాయి విక్రయం, ఆడపిల్లల వేధింపు నేరాలు కాదన్నట్లు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
చీరాలలో కిరణ్ కుమార్ అనే వ్యక్తిని మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపారు. డాక్టర్ సుధాకర్‌ను మాస్క్ అడిగినందుకు నడిరోడ్డుపై దాడి చేసి చంపారు. గురజాలకు చెందిన దోమతోటి విక్రమ్‌ను హైదరాబాద్ నుంచి పిలిపించి వైసీపీ గూండాలు హత్య చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుని పోలీసులు కిరాతకంగా వేధించారు. ఇసుక దందా గురించి ప్రశ్నించిన వరప్రసాద్‌ను పోలీస్ స్టేషన్‌లో శిరోముండనం చేసి అవమానించారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేసి, శవాన్ని డోర్ డెలివరీ చేశారు, కేసు పట్టించుకోలేదు.
ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడం, ఆడపిల్లల రక్షణ, గంజాయి నిర్మూలన కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే, జగన్ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటున్నాడు. గతంలో మతాల మధ్య, ఇప్పుడు కులాల మధ్య విభేదాలు రెచ్చగొడుతున్నాడు. విజయసాయి రెడ్డి వంటి పాత ముద్దాయిలు పక్కకు వెళ్లిపోయారు, కొత్త వారిని చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే కుట్రలు, కుయుక్తులతో ప్రజలను మభ్యపెడుతున్నాడని ఆనంద్ బాబు ఆరోపించారు.
addComments
Post a Comment