రాయచోటి (ప్రజా అమరావతి);
. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్న బీజేపీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టే ధైర్యం ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలకు బీజేపితో మిత్రబంధం ఉంటే..ప్రతిపక్ష వైసీపీకి అక్రమ సంబంధం ఉంది. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుంటే ఈ మూడు పార్టీలు నోరు మెదపవు. బీజేపి అంటే బాబు,జగన్,పవన్. రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ పోలవరం, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్ వంటి అనేక హామీలు ఇచ్చింది. దురదృష్టవశాత్తు ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ ఓడిపోవడతో ఇచ్చిన విభజన హామీలన్ని అటకెక్కాయి. ఇక చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్. కూటమి పాలన మొత్తం 3d గ్రాఫిక్స్. కరెంట్ బిల్లులు పెంచం అంటూనే రూ.17 వేల కోట్లు జనాల నెత్తిన వేశారు. ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాష్ట్రానికి హోదా తెచ్చేది కాంగ్రెస్ పార్టీనే. రాజధాని కట్టేది కాంగ్రెస్ పార్టీనే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులొచ్చాయి. ఇలాంటి సమయంలోనే ప్రతి ఒక్కరు ఒక ఆయుధంలా పని చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు మిగిలిన ఈ నాలుగేళ్లు ప్రతి ఒక్కరు తీవ్రంగా కష్టపడాలని పిలుపు ఇస్తున్నాను.
addComments
Post a Comment