ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కొరకు భారత ప్రభుత్వం పిఎల్ఐ, ఇన్సెంటివ్స్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తోంది: భారత జాయింట్ సెక్రెటరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి శ్రీ సుశీల్ పాల్.

 


*ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కొరకు భారత ప్రభుత్వం పిఎల్ఐ, ఇన్సెంటివ్స్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తోంది: భారత జాయింట్ సెక్రెటరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి శ్రీ సుశీల్ పాల్


*


*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు పరిశ్రమల స్థాపనకు పుష్కల అవకాశాలు ఉన్నాయి*


*ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీం (ECMS) మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ముసాయిదా.... పెట్టుబడుల ప్రమోషన్ వర్క్ షాప్ విజయవంతం*


*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలో రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నాం: సెక్రటరీ ఐటిఈ&సి భాస్కర్ కాటమనేని*


తిరుపతి, జూన్05 (ప్రజా అమరావతి):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు పుష్కల అవకాశాలు ఉన్నాయని, తిరుపతి లో నిర్వహించిన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీం (ECMS) మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ముసాయిదా.... పెట్టుబడుల ప్రమోషన్ వర్క్ షాప్ విజయవంతం అయిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామని ఐటిఈ&సి శాఖ సెక్రటరీ భాస్కర్ కాటమనేని పేర్కొన్నారు.


గురువారం మధ్యాహ్నం ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీం (ECMS) మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ పెట్టుబడుల ప్రమోషన్ కొరకు ఐటి ఈ&సి మరియు ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ వారు సంయుక్తంగా ఒక్క రోజు కార్యశాలను మారస సరోవర్ ప్రీమియర్ హోటల్ తిరుపతి నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత జాయింట్ సెక్రెటరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి శ్రీ సుశీల్ పాల్,  ఏపీ సెక్రటరీ ఆంధ్ర ప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కార్యదర్శి భాస్కర్ కాటమనేని, రాజేష్ శర్మ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ అడ్వైసర్ ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్, రష్మి రతి తివారీ సైంటిస్ట్, పలు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.


భారత జాయింట్ సెక్రెటరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి శ్రీ సుశీల్ పాల్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కొరకు భారత ప్రభుత్వం పిఎల్ఐ, ఇన్సెంటివ్స్ అందజేస్తూ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తోందని తెలిపారు. పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలకు అభినందనలు అని తెలిపారు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు చక్కగా ఉన్నాయని తెలిపారు. పలు రాష్ట్రాలు ఈ స్కీం అమలు చేస్తున్నాయని తెలిపారు.


ఈ సందర్భంగా సెక్రటరీ ఐటిఈ&సి భాస్కర్ కాటమనేని మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య మార్గదర్శకాలు విడుదల చేసి ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పాలసీ కన్నా అదనంగా మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి రాయితీలు గానీ, సదుపాయాలు కానీ మెరుగ్గా అందించడానికి మన ఆంధ్ర ప్రదేశ్ పాలసీ మెరుగ్గా ఉండేలా రూపొందిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా తిరుపతి జిల్లాలో మారస సరోవర్ ప్రీమియర్ హోటల్ నందు ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలు వారి ప్రతినిధులతో ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇప్పటివరకు వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల స్థానంలో మన రాష్ట్రంలో స్థానికంగా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు తయారీ చేసే పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ మంచి విధానాన్ని తీసుకురానున్నామని తెలిపారు. అంతేకాకుండా 25 శాతం ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు దక్షిణ రాయలసీమ నందు నెలకొల్పటానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పలు పారిశ్రామికవేత్తలతో పరిశ్రమల ప్రతినిధులతో ఒకరోజు  కార్యశాల ఏర్పాటు చేసి వారిని మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని కోరామని సదరు వర్క్ షాప్ విజయవంతమైందని సెక్రటరీ ఐటీ ఈ&సీ పేర్కొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. శ్రీసిటీ లోని ఎల్జి పరిశ్రమకు ఆరు నెలల్లోనే భూమి పూజ చేయడం జరిగిందని అన్నారు. శ్రీ సిటీ నందు 200 పైన పరిశ్రమలు ఉన్నాయని, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న ఒక గొప్ప పారిశ్రామిక వాడ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీ వినియోగించి పారదర్శకమైన సుపరిపాలనను ఏఐ టెక్నాలజీ, వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజి, ఐ.ఓ.టీ, డ్రోన్స్ తదితర వాటి వినియోగంతో అందిస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. మన అందరికీ తెలుసు గత పది సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రస్థానంలో ఎప్పుడు ఉంటోందని తెలిపారు. తిరుపతి నందు ఈఎంసీ-2 క్లస్టర్, ఈఎంసి కొప్పర్తి తదితర ఎలక్ట్రానిక్స్ పారిశ్రామిక వాడలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సన్రైస్ ఆంధ్ర ప్రదేశ్ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని ఈజ్ ఆఫ్ డూఇంగ్ బిజినెస్ మాత్రమే కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి సమస్యలను అతి తక్కువ సమయంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మన రాష్ట్రంలో రైల్వే కనెక్టివిటీ, రహదారులు, విమానాశ్రయాలు, పోర్టులు  తదితర సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయని, తగినంత ల్యాండ్ బ్యాంక్ ఉందని తెలిపారు. భారత ప్రభుత్వం లక్ష్యాల కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047 తో ముందుకు వెళుతుందని తెలిపారు. 2.40 ట్రిలియన్స్ ఎకానమీ 2047 నాటికి ఐటి మాత్రమే కాకుండా ఇతర పరిశ్రమలు, ఇతర సెక్టార్ల నుండి అందిపుచ్చుకోవాలనేది మన రాష్ట్ర లక్ష్యం అని తెలిపారు. రాష్ట్రంలో పలు ఉన్నత విద్యా యూనివర్సిటీలు ఉన్నాయని తగినంత మంది నైపుణ్యం కలిగిన స్కిల్డ్ పర్సన్స్ అందుబాటులో ఉన్నారని తెలిపారు. పరిశ్రమలకు కావలసిన మేరకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించి తయారు చేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు.


ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహిస్తూ గౌరవ ముఖ్యమంత్రి పలు చర్యలు తీసుకుంటూ పారిశ్రామికవేత్తలకు అండగా ఉండే పాలసీ అమలు చేస్తున్నారని కొనియాడారు.


అనంతరం జాయింట్ సెక్రెటరీ భారత ప్రభుత్వం వారికి ఏపీ సెక్రెటరీ ఐటీ ఈ&సీ వారికి, ముఖ్య అతిథులకు, పలువురు పారిశ్రామికవేత్తలకు మొమెంటోలు అందజేశారు.


Comments