ఆయుర్వేదం నందు ఔషధ సేవన కాలముల గురించి సంపూర్ణ వివరణ  -

ఆయుర్వేదం నందు ఔషధ సేవన కాలముల గురించి సంపూర్ణ వివరణ  -


  ఆయుర్వేదం నందు ఔషధాలను సేవించు విధానమును రోగాలకు బట్టి 10 రకాలుగా వర్గీకరించబడినది. ఈ విధముగా ఔషధాలను సేవించినచో ఆయా ఔషధాలు బలంగా పనిచేసి రోగి తొందరగా కోలుకుంటాడు. మరియు ఔషధాలను సూర్యోదయానికి ముందు , సూర్యాస్తమయం తరువాత సేవించిన మంచిఫలితాలు పొందగలరు. ముఖ్యంగా ఔషధసేవన గురువారం నందు మొదలు పెట్టిన త్వరగా రోగం నుంచి విముక్తి పొందవచ్చు.


  ఆయుర్వేదం వర్గీకరించిన 10 రకాల ఔషధసేవన కాలాలు  -


 * అనన్నౌషధ కాలము  -


        తినినట్టి ఆహారం పూర్తిగా జీర్ణం అయిన తరువాత ఔషధాన్ని సేవించుట . రోగి బలవంతుడుగా ఉన్నప్పుడు కఫరోగం నందు దీనిని ఉపయోగించవలెను .


 * అన్నాదౌష్యధ కాలము  -


        ఆహారమును భుజించుటకు ముందు ఔషధమును తినినవెంటనే ఆహారమును భుజించుట . దీనిని అపానవాతం ప్రకోపించినప్పుడు ఉపయోగించవలెను .


 * మధ్యోషధ కాలము  -


         ఆహారం తినునప్పుడు మధ్య సమయం నందు తినునట్టి ఔషధం . దీనిని సమాన వాతం ప్రకోపించినప్పుడు ఉపయోగించవలెను .


 * అంతౌషధ కాలము  -


         ఆహారం భుజించుతూ ఉన్న సమయంలో చివరలో ఔషధం సేవించటం . దీనిని వ్యానవాతం ప్రకోపించినప్పుడు మధ్యాహ్న భోజనం చివర సమయంలో , ఉదాన వాతం ప్రకోపం చెందినపుడు రాత్రి భోజనం యొక్క చివరలో ఔషధం సేవించవలెను .


 * కబాలాంతరౌషధ కాలము -


          ఆహారం భుజించునప్పుడు మొదటిముద్ద తిని వెంటనే ఔషధమును భుజించిన పిదప మరలా ఒక ముద్ద అన్నము తినునట్టి ఔషధం . దీనిని ప్రాణవాతం ప్రకోపం చెంది ఉండునప్పుడు ఉపయోగింపవలెను.


 * గ్రాసగ్రాసౌషధ కాలము  -


          ప్రతి అన్నపు ముద్దతోను ఔషధం చేర్చి భుజించటం. దీనిని ప్రాణవాతం ప్రకోపం చెందినపుడు ఉపయొగింపవలెను.


 * ముహురౌషధ కాలము -


           అన్నము తిన్నను , తినకున్నను ఔషధమును అనేక పర్యాయాలు తీసుకోవడం . దీనిని విషదోషం , వాంతులు , ఎక్కిళ్లు , దప్పిక, శ్వాస , దగ్గు అను రోగములు కలవారికి ఉపయోగించవలెను .


 * స్నానౌషధ కాలము -


           ఆహారంతో కూడా చేర్చి తినునట్టి ఔషధము . నోటికి రుచిలేకపోవుట వంటి రోగముల యందు అనేక రకాల ఆహార పదార్ధములతో చేర్చి ఉపయోగించవలెను .


 * సాముద్గౌషధ కాలము -


           మొదట ఔషధమును తిని వెంటనే ఆహారంను భుజించి మరలా ఔషధమును సేవించుట . దీనిని ఆక్షేపక వాతము , ఎక్కిళ్లు , కంపవాతం అనగా పార్కిన్సన్స్ వ్యాధి నందు ఉపయోగించవలెను .


 * నిశౌష్యథ కాలము  -


           రాత్రి పడుకునే సమయం నందు తినునట్టి ఔషధము . దీనిని మెడకొంకులకు పై భాగమున పుట్టు రోగములు నందు ఉపయోగింపవలెను .


         పైన చెప్పిన విధముగా 10 రకములుగా ఔషధసేవన పద్ధతులు కలవు. ఔషధంతో పాటు ఔషధసేవన కాలం కూడా రోగాన్ని తగ్గించడంలో ప్రముఖపాత్ర వహించును.


   
     గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు


Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image