చరిత్ర అధ్యాపకులు పోతురాజుకు పీహెచ్ డీ - అభినందించిన ఏపీఎంవీపీసీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి . గుంటూరు(ప్రజాఅమరావతి): గుంటూరులోని శ్యామలానగర్ కి చెందిన చరిత్ర అధ్యాపకులు పాలేరు పోతురాజుకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను అందించింది. 'గుంటూరు జిల్లాలో రెండో శతాబ్ధం నుంచి 16వ శతాబ్ధం వరకు జరిగిన శిల్పకళ' అనే అంశంపై ఆయన పరిశోధనా పత్రం ఏఎన్ యూకి సమర్పించారు. దీనికి ఏఎన్ యూ అధికారులు ఆమోదముద్ర వేసి డాక్టరేట్ ను అందించారని ప్రొఫెసర్ పాలేరు పోతురాజు తెలిపారు. చరిత్ర మరియు పురావస్తు శాఖ ప్రొఫెసర్ ఎస్.మురళీమోహన్ పర్యవేక్షణలో తాను పరిశోధన కొనసాగించినట్లు వివరించారు. ఆయనకు డాక్టరేట్ రావడం పట్ల ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. పోతురాజు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పోతురాజు మాట్లాడుతూ పి హెచ్ డి పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. తనకు సహకరించిన ఏఎన్ యూ చరిత్ర శాఖ ప్రొఫెసర్లకి కృతజ్ఞతలు తెలిపారు.


Comments