*బోటింగ్‌ ఆపరేషన్స్‌ మరియు కంట్రోల్‌ రూమ్స్‌ను ప్రారంభించిన సీఎం* *అమరావతి:(ప్రజాఅమరావతి); *బోటింగ్‌ ఆపరేషన్స్‌ మరియు కంట్రోల్‌ రూమ్స్‌ను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌* *9 చోట్ల కంట్రోల్‌ రూమ్స్‌ను ప్రారంభించిన సీఎం* *క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా ప్రారంభం* *మంత్రులు అవంతి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరు కంట్రోల్‌ రూమ్స్‌ వద్దనున్న కలెక్టర్లనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం బోటింగ్‌ కార్యకలాపాలు, నియంత్రణపై రూపొందించుకున్న ఎస్‌ఓపీలను తప్పనిసరిగా పాటిస్తున్నారా? లేదా? అన్నదానిపై కలెక్టర్లు దృష్టిసారించాలి: సీఎం పర్యాటకులు, ప్రయాణికుల భద్రతకోసం ప్రభుత్వం తొలిసారిగా తీసుకున్న చర్యలు : గోదావరి నదిలో ప్రమాదం జరిగిన తర్వాత, దాన్ని వదిలేయకుండా.. ఒక ప్రభుత్వంగా వ్యవహరించి.. తగిన చర్యలు తీసుకుంటున్నాం: 9 కంట్రోల్‌ రూమ్స్‌ను ఏర్పాటుచేసి తగిన సిబ్బందిని అందులో ఉంచుతున్నాం: లైసెన్సింగ్‌ విధానం పై కూడా ప్రత్యేక ఎస్‌ఓపీలను రూపొందించి ఆమేరకు చర్యలు తీసుకుంటున్నాం: మళ్లీ అలాంటి ప్రమాదం జరగకుండా ఏంచేయాలన్నదానిపై మనం ఆలోచనలు చేసి.. ఈ కంట్రోల్‌ రూంలను తీసుకు వచ్చాం: ప్రమాదం జరిగినప్పుడు స్పందించి తర్వాత వదిలేయడం కాకుండా ఒక అడుగు ముందుకేసి.. మనం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నాం: అధికారులందరినీ కూడా అభినందిస్తున్నా : ప్రతి వారం కలెక్టర్లు తప్పకుండా పర్యవేక్షణ చేసి ఎస్‌ఓపీలను పాటిస్తున్నారా? లేదా? అన్నదాన్ని పరిశీలించాలి: *కంట్రోల్‌ రూమ్స్‌పై మరిన్ని వివరాలు:* బోటింగ్‌ కార్యకలాపాలపై ఇలాంటి చర్యలు తీసుకోవడం దేశంలోనే తొలిసారి బోట్ల నిర్వహణపై ఎండ్‌ టు ఎండ్‌ మేనేజ్‌ మెంట్‌ ఉంటుంది అత్యాధునిక పరికరాలను వినియోగించారు శిక్షణ పొందిన సిబ్బంది ఉంటారు రక్షణ, భద్రతా ప్రమాణాలను పాటించేలా నిర్దేశిత ప్రోటోకాల్‌ ఉంటుంది అనుకోని ఘటన జరిగితే ఏం చేయాలన్న దానిపై విపత్తు నిర్వహణ ప్రోటోకాల్‌ ఉంటుంది *రాష్ట్రంలో మొత్తం 9 చోట్ల కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు* ప.గో.జిల్లా సింగనపల్లి తూ.గో.జిల్లా గండి పోచమ్మ ప.గో.జిల్లా పేరంటాలపల్లి ప.గో.జిల్లా పోచవరం తూ.గో.జిల్లా రాజమండ్రి విశాఖ జిల్లా రుషి కొండ గుంటూరు జిల్లా నాగార్జున సాగర్‌ కర్నూలు జిల్లా శ్రీశైలం కృష్ణాజిల్లా విజయవాడలోని బెరం పార్క్‌ల వద్ద కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు గోదావరిలో పడవబోల్తా ఘటనను దృష్టిలో ఉంచుకుని సీఎం ఆదేశాల ప్రకారం జారీ అయిన జీవో ఆర్టీ నంబర్‌ 10 కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు బోట్లు ఏవైనా సరే ఏపీ మారిటైం బోర్డులో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి వీటికి టూరిజం డిపార్ట్‌మెంట్‌ ఎన్‌ఓసీ జారీచేస్తుంది పర్యాటకుల రక్షణ భద్రత కోసం కంట్రోల్‌ రూమ్స్‌ను నిర్మించారు సమాచారం, భద్రత, రక్షణలకోసం ప్రత్యేక పరికరాలు, సామగ్రిని కొనుగోలు చేశారు భద్రతా పరికరాలను బోట్లలో అమర్చారు బోటింగ్‌ ఆపరేషన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఆపరేషనల్‌ గైడ్‌లైన్స్‌ జారీచేశారు అందుబాటులోకి ఎండ్‌ టు ఎండ్‌ మేనేజ్‌ మెంట్‌ సిస్టం అన్ని బోట్లూ టూరిజం డిపార్ట్‌మెంటులో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి ప్రతిబోటు కదలాలంటే డిపార్చర్‌ క్లియరెన్స్‌ తప్పనిసరి బోట్ల ఆపరేషన్‌పై రియల్‌ టైం ఇన్ఫర్మేషన్‌ వస్తుంది ప్రయాణికులు, పర్యాటకులు వివరాలు సమగ్రంగా నమోదవుతాయి డాష్‌ బోర్డుపై రోజువారీ వివరాలు కనిపిస్తాయి లైసెన్స్‌ కాలం ముగియగానే కంట్రోల్‌ రూంకు, బోటింగ్‌ ఓనర్లకూ అలర్ట్స్‌ వస్తాయి ఏదైనా జరగరాని ఘటన జరిగితే వెంటనే సంబంధిత విభాగలన్నింటికీ హెచ్చరికలు పంపించేలా ఏర్పాట్లు కంట్రోల్‌ రూం మేనేజర్‌గా రెవిన్యూ డిపార్టుమెంట్ నుంచి ఉంటారు మొత్తం బోటింగ్‌ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు నీటిపారుదల శాఖ, బోట్లు ప్రయాణించాల్సిన మార్గాలు, వాతావరణం తదితర విభాగాలతో సమన్వయానికి లైజనింగ్‌ ఆఫీసర్‌ ఉంటారు టూరిజం డిపార్ట్‌మెంట్‌ నుంచి సిస్టం ఆపరేటర్‌ ఉంటారు టూరిజం విభాగం నుంచి తనిఖీలకోసం కూడా సిబ్బంది ఉంటారు పోలీస్‌ విభాగం నుంచి రక్షణ సిబ్బందీ ఉంటారు టూరిజం డిపార్ట్‌మెంట్‌ నుంచి గత ఈతగాళ్లతో పాటు లైఫ్‌ గార్డ్స్‌ సిద్ధంగా ఉంటాయి. ప్రతి కంట్రోల్‌ రూంలో టికెటింగ్‌ కౌంటర్‌ అనౌన్స్‌ మెంట్లకోసం పీఏ సెంటర్‌ రెస్ట్‌రూమ్స్, వెయిటింగ్‌ ఏరియాలు *సీసీటీవీ పర్యవేక్షణ* *అగ్నిమాపక పరికరాలు* *టీవీ స్క్రీన్లపై సలహాలు, సూచనలు* *ప్రాథమిక చికిత్స, బ్రీత్‌ ఎనలైజర్‌ పరికరాలు* *ప్రమాదంలో ఉన్నవారిని రక్షించడానికి పెట్రోలింగ్‌, రెస్క్యూ బోట్లు,లైఫ్‌ జాకెట్లు.*


Comments