, రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. గురువారం ఎర్రగొండ పాలెం నియోజకవర్గ పరిధిలోని పెద్దారవీడు మండల కేంద్రంలో 1.60 కోట్ల రూపాయల తో కస్తూరిభా గాంధీ జూనియర్ కాలేజీని అభివృద్ధి పనులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధముగా ముఖ్యమంత్రి విద్యా రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు.రాష్ట్రంలో విద్యా రంగంను అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తన్నా రన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లలను ప్రోత్సాహించడానికి బడికి పంపే ప్రతి తల్లి ఖాతాలోకి అమ్మ ఓడి పథకం క్రింద 15 వేల రూపాయలు జమ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు పేదరికం విద్య కు అడ్డంకి కాకూడదని జగనన్న విద్యా దీవేన పధకాన్ని అమలు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నవరత్నాల తోఅమలు చేశారన్నారు. రాష్ట్రంలో అందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో 3వేల9 మందికి డప్పు కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులనుమంజూరు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. అందులో భాగంగా ఈ రోజు ఎర్రగొండ పాలెం నియోజకవర్గ పరిధిలోని డప్పు కళాకారులకు మంత్రి గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కె.జి.బి.వి.డైరెక్టర్ ప్రసన్న కుమార్, విద్యాశాఖ ఆర్.జె.డి రవీంద్ర రెడ్డి, ఎస్.ఎస్.ఎ. అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ ఎ. డి.శ్రీ నారాయణ రెడ్డి, వై.సి.పి నాయకులు డి.వెంకట రెడ్డి, పి.కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Comments