*ప్రభగిరి పట్నం మైనింగ్ టర్నోవర్ లో నీ వాటా ఎంత గోవర్ధన్ రెడ్డీ.. నీ ఛాలెంజ్ కి నేను ఎప్పుడైనా రెడీ..ఆనం బ్లడ్ ఇక్కడ..వెనకడుగు వేసే ప్రసక్తే లేదు...* *కొండలపై గుప్తనిధులు ఏమయ్యాయి..దేవతా విగ్రహాలు లండన్ లో అమ్మేశారంట..కదా..* *ఆ కొండ ఎక్కలేదంటున్నావ్...అయితే ఏ కొండ ఎక్కావో..ఏ కొండ మాయమైందో చెప్పు..* *టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి...* రాష్ట్రంలో ఇప్పటికే రథాలు, ఆలయాలను కూలగొడుతున్నారు..చివరకు దేవుడి కొండలను కూడా వదలరా.. పొదలకూరు మండలంలోని ప్రభగిరిపట్నం దేవుడి కొండలపై గుప్తనిధులున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే బుడ్డారెడ్డే చెప్పారు.. ఆ కొండలపై మైనింగ్ తో పాటు గుప్తనిధుల తవ్వకం జరుగుతోందని పొదలకూరు మండల ప్రజలే చెబుతున్నారు.. విగ్రహాలు కూడా అదృశ్యమయ్యాయట...వాటిని లండన్ తీసుకెళ్లి అమ్మేశారని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. రోజుకు 30 లారీల ఖనిజం తరలిపోతోంది..ఒక్కో లారీలోని ఖనిజం విలువ రూ.4.50 లక్షలు..రోజుకు రూ.70 లక్షల నుంచి రూ.కోటికి పైగా టర్నోవర్.. ఈ మైనింగ్ టర్నోవర్ లో గోవర్ధన్ రెడ్డి వాటా ఎంత.. కొండలపై తవ్వేసిన విగ్రహాలు ఎక్కడ పెట్టారు..గుప్త నిధుల పరిస్థితి ఏంటి.. కనీసం ప్రభుత్వానికి రాయల్టీ కూడా చెల్లించకుండా రాత్రికి రాత్రే విలువైన ఖనిజాన్ని తరలిస్తున్నారంటే దేవుడిని మోసం చేసినట్టా...సీఎం జగన్మోహన్ రెడ్డిని మోసం చేసినట్టా..జిల్లాలోని హిందువలను మోసం చేసినట్టా.. ప్రభగిరిపట్నం కొండల్లో మైనింగ్ పై సమగ్ర విచారణ జరగాల్సిందే.. గోవర్ధన్ గిరిగా కొండను కాపాడతాడనుకుంటే చివరకు కొండనే ఎత్తుకెళ్లిపోయాడని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.. పవిత్రమైన విష్ణు కొండ..క్రిష్ణమ్మ కొండ..పెద్దమ్మ కొండల్లో ఏ కొండ ఎత్తేశారో బుడ్డారెడ్డే చెప్పాలి.. సనాతన ధర్మానికి సంబంధించిన పేర్లతో పెట్టిన కొండలను కాపాడుకోవాల్సిన బాధ్యత జిల్లాలోని హిందువులందరిపై ఉంది.. కొండను తాను ఎత్తుకెళ్లిపోలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత గోవర్ధన్ రెడ్డిపైనే ఉంది.. సోమ లేదా మంగళవారం కలెక్టర్ ను కలిసి సమగ్ర విచారణ జరపాలని, అక్రమ మైనింగ్ ఆపాలని కోరుతాం.. ఈ పోరాటాన్ని పార్టీపరంగా, రాజకీయంగా అనుకోవద్దు...ప్రజలందరూ చైతన్యవంతులై పోరాడితేనే మన దేవుడి కొండలు మనకు దక్కుతాయి.. నా కారు డ్రైవర్ సవాల్ విసిరితే కాకాణి స్వీకరిస్తారా..నేను అంతే...కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరితే స్వీకరించేందుకు నేను సిద్ధం..నీ ఛాలెంజ్ కి ఎప్పుడైనా రెడీ ఆ కొండ ఎక్కలేదు..దానిపై బండ కూడా తీయలేదంటున్నారు....ఆ రోజు ఎన్ని కొండలైనా ఎక్కుతానన్నావ్..ఈ రోజు ఒక కొండ మాయమైపోయింది..ఏ కొండ ఎత్తేశావో నువ్వే చెప్పు.. మగధీర సినిమాలో సైతాన్ కి ఫౌజియో తరహాలోని మీ చెంచాలతో మీ ఇంట్లో గుడ్డలు ఉతికించుకోండి..అంతే కానీ వారికి మేం సమాధానం చెప్పాలా... *నోట్: ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఖనిజాన్ని సిలికాగా సంభోదించాను. కానీ అది విలువైన క్వార్ట్జ్ గా అర్ధం చేసుకోగలరు..*


Comments