అమరావతి(ప్రజా అమరావతి);
అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.
పలు కీలక అంశాలపై చర్చించిన మంత్రివర్గం.
నివర్ తుపాను ప్రభావం, రాష్ట్రంలో వర్షాలు, పంట నష్టంపై కేబినెట్ విస్తృత చర్చ
వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు, జరిగిన నష్టాన్ని కేబినెట్‌కు వివరించిన అధికారులు
నవంబర్ 23–26 మధ్య నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో 288.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని వెల్లడించిన అధికారులు
సాధారణ వర్షపాతంలో పోలిస్తే 188శాతం అధికంగా కురిసిందని వెల్లడి
నెల్లూరులో 2, చిత్తూరులో 5, వైయస్సార్ కడపలో 2, ప్రకాశంలో 1 మండలాల్లో అత్యధిక వర్షపాతం కురిసిందన్న అధికారులు
ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు 664 ఇళ్లు మునిగాయని, 673 ఇళ్లు దెబ్బతిన్నాయన్న అధికారులు
147 సహాయక శిబిరాలను తెరిచామన్న అధికారులు
10వేలమందికిపైగా ఇందులో ఉన్నారని తెలిపిన అధికారులు
నవంబరు 26వ తేదీ ఉదయం వరకూ అందిన ప్రాథమిక వివరాల ప్రకారం 29,752 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వెల్లడి
16,290 హెక్టార్లలో వరి, 7362 హెక్టార్లలో మినుము, 3571 హెక్టార్లలో పత్తి, 2,529 హెక్టార్లలో ఇతర పంటలకు నష్టం జరిగిందని వివరణ
ప్రకాశం జిల్లాలో 10,300 హెక్టార్లు, చిత్తూరులో 10,166 హెక్టారర్లు, వైయస్సార్ కడప జిల్లాలో 4886 హెక్టార్లు, నెల్లూరులో 4400 హెక్టార్ల మేర పంట నష్టపోయినట్టు మంత్రివర్గానికి వెల్లడించిన అధికారులు
1371 హెక్టార్లలో ఉద్యానవన పంటలు కూడా దెబ్బతిన్నాయని వెల్లడి
ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 175 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయని, నాలుగు చోట్ల గండ్లు పడ్డాయని వివరణ
విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని వెల్లడించిన అధికారులు
*సీఎం నేతృత్వంలో కేబినెట్‌నిర్ణయాలు:*
1. భారీ వర్షాలు కారణంగా సహాయ శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 చొప్పున ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో అధికారులకు ఆదేశం.
2. డిసెంబర్ 15 కల్లా పంట నష్టాన్ని నిర్ధారించాలని, డిసెంబర్ 30 నాటికి బాధితులకు పరిహారం అందించాలని ఆదేశం.
3. పంట నష్టపోయిన ప్రాంతాల్లో... 80శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరాచేయాలని ఆదేశం.
4. ఆస్తినష్టం, ప్రాణనష్టాలు ఉంటే.. మార్గదర్శకాల ప్రకారం వారికి త్వరగా పరిహారం అందించేలా చూడాలని ఆదేశం.
డిసెంబర్ 25న నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు ప్రారంభం
కేబినెట్ ఆమోదం
30.6 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వనున్న ప్రభుత్వం
ఇందుకోసం రూ.23 వేల కోట్ల విలువైన 66,518 ఎకరాలను సేకరించిన ప్రభుత్వం
అందులో 25,193 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 22,342 ఎకరాలు ప్రైవేటు భూమి
ప్రస్తుతం లబ్ధిదారులకి డీ ఫాం పట్టాలు పంపిణీ
కోర్టు కేసులు పరిష్కారమయిన తర్వాత కన్వెయిన్స్ డీడ్ ఇవ్వడం జరుగుతుంది.
11 వేల పంచాయితీల్లో 17,500 లే అవుట్‌లలో ఇళ్ల స్ధలాలు
వైయస్సార్ – జగనన్న కాలనీల కింద ఇళ్ల నిర్మాణం, కేబినెట్ ఆమోదం
28.3 లక్షలమందికి ఇళ్లుకూడా కట్టించి ఇవ్వనున్న ప్రభుత్వం
మూడేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యం
తొలిదశలో 8494 లేఅవుట్లలో సుమారు 16 లక్షల ఇళ్లు కట్టించనున్న ప్రభుత్వం
ఒక్కో యూనిట్‌కు రూ. 1.8 లక్షల చొప్పున తొలిదశ ఇళ్ల నిర్మాణానికి దాదాపు రూ. 28,800 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
పేదల ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా
18 నెలల్లో, 2022 జూన్ నాటికి మొదటి విడత ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం
డిసెంబరు 25 నుంచి మొదలుపెట్టి రెండు వారాలపాటు ప్రతిరోజు లక్ష చొప్పున ఇళ్ల నిర్మాణంప్రారంభం
175 నియోజకవర్గాల్లో మొదలు కానున్న ఇళ్ల నిర్మాణ పనులు
మిగిలిన 13 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని 2021 డిసెంబరులో ప్రారంభించి 2023 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం.
భూముల సమగ్ర రీ సర్వే ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం
వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షణ పథకం కింద సమగ్ర సర్వే, డిసెంబర్ 21 నుంచి సర్వే ప్రారంభం
పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని డ్రోన్లు, రోవర్లు, బేస్ స్టేషన్ల ఏర్పాటుతో సర్వే
సర్వే రాళ్లను రైతులకు ఉచితంగా ఇవ్వనున్న ప్రభుత్వం
రూ.927 కోట్లతో ల్యాండ్ సర్వే ప్రాజెక్టు
ల్యాండ్ కన్వర్షన్ చట్టం సవరణకోసం ఉద్దేశించిన ముసాయిదాకు కేబినెట్ ఆమోదం
2006 నాటి చట్టాన్ని సవరించనున్న ప్రభుత్వం
ఇదివరకే దీనిపై ఆర్డినెన్స్ జారీ
నాగార్జున సాగర్ పక్కనే ఉన్న విజయపురి సౌత్‌లో రెసిడెన్షియల్ డిగ్రీకాలేజీ,
ప్లే గ్రౌండ్, సిబ్బందికి క్వార్టర్ల నిర్మాణంకోసం విద్యాశాఖకు భూమి కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం
మొత్తంగా 21 ఎకరాలు ఇవ్వనున్న ప్రభుత్వం
విజయనగరం జిల్లా కురుపాం మండలం తేకరఖండిలో గిరిజన ఇంజినీరింగ్‌కాలేజీ కోసం 105.32 ఎకరాల ప్రభుత్వభూమి
కాలేజీని ఏర్పాటు చేస్తున్న జేఎన్‌టీయూకేకు దఖలుపడనున్న భూమి
2019 ఖరీఫ్ నుంచి రైతులకు ఉచిత బీమా అమలుకు కేబినెట్ అంగీకారం
2019 –20 ఖరీఫ్‌కు సంబంధించి పంటల బీమా డిసెంబర్ 15న పంపిణీ
మహిళల్లో ఆర్థిక స్వాలంబన, సుస్థిర ఆర్థిక ప్రగతికోసం అమూల్ భాగస్వామ్యంతో చేపడుతున్న కార్యక్రమానికి కేబినెట్ అనుమతి
డిసెంబర్ 2 నుంచి అమల్లోకి కార్యక్రమం
చేయూత, ఆసరా లబ్ధిదారుల్లో ఆప్షన్లు ఎంపిక చేసుకున్న మహిళలకు ఆవులు, గేదెల యూనిట్లను పంపిణీ
వైయస్సార్ కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని 400 గ్రామాల్లో మొదట ప్రారంభం
ఇదే కార్యక్రమం కింద గొర్రెలు, మేకలను పంపిణీ
2.49 లక్షల యూనిట్లు పంపిణీకి కార్యాచరణ ప్రణాళిక, కేబినెట్ ఆమోదం
14 గొర్రెలు లేదా మేకపిల్లలు, ఒక గొర్రెపోతు లేదా మేకపోతు కలిపి ఒక యూనిట్
డిసెంబర్ 10 నుంచి పంపిణీ కార్యక్రమం ప్రారంభం
రాష్ట్రంలో నాణ్యమైన పశుదాణా ఉత్పత్తి, పంపిణీ, ధరల నియంత్రణకు ఉద్దేశించిన బిల్లు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం
అసెంబ్లీ సమావేశాల్లోకి బిల్లు
అనంతపురం జిల్లా పెనుకొండలో గొర్రెల పెంపకం కేంద్రంలో శిక్షణ కేంద్రంగా మార్చడానికి కేబినెట్ ఆమోదం
దీనికోసం రూ.2.5 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్శిటీ చట్టం–2020 కోసం ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం
రాష్ట్రంలో ఫిషరీస్, ఆక్వా సాగు రంగంలో సమగ్రాభివృద్ధికి దోహదపడుతూ నిపుణులను, ప్రొఫెషనలిస్టుల తయారీకోసం యూనివర్శిటీ ఏర్పాటు
ఈ యూనివర్శిటీ నుంచి డిగ్రీ కోర్సులు, పీజీ కోర్సులు
ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (యూఐపీడీసీఎల్) పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు
రిజిస్ట్రేషన్‌కు కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ పల్నాడు ఏరియా డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ఏపీ పీఏడీఎంపీసీఎల్) పేరిట ఎస్పీవీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
ఇందులో భాగంగా గుంటూరు ఛానల్ ఎక్స్‌టెన్షన్ స్కీం, వైయస్సార్ – వేదాద్రిలిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు
కృష్ణా– కొల్లేరు సెలైనిటీ మిటిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎపీ కేకేఎస్‌ఎంపీసీఎల్) ఎస్పీవీగా ఏర్పాటు, కేబినెట్ ఆమోదం
డ్యాం రీహేబిలిటేషన్, ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్టుకు ఫేజ్ –2, 3కు కేబినెట్ ఆమోదం
రూ.776.5 కోట్ల పరిపాలనా పరమైన అనుమతులకు కేబినెట్‌ఆమోద ముద్ర
నిధులు సమకూర్చనున్న ప్రపంచబ్యాంకు
సోమశిల, కండలేరు కాల్వ సామర్థ్యాన్ని 12వేల నుంచి 24వేలకు పెంచే పనులకోసం ఇచ్చిన పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం
45 కి.మీ. మేర కాల్వ పనులు, రెండు బ్రిడ్జిలు సహా పలు పనులు
దీనికోసం సుమారు రూ.918 కోట్లు ఖర్చు
అనంతపురం జిల్లా చిత్రావతి బాలెన్సింగ్ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో 10 టీఎంసీల నీటిని నిల్వచేయడానికి చర్యలు
ముంపు బాధితులకు సహాయ, పునరావాస కార్యక్రమాలకోసం రూ.240.53 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం
4 గ్రామాల పరిధిలోని 1729 కుటుంబాల్లోని నిర్వాసితులకు పరిహారం
ప్రకాశం జిల్లా రాళ్లపాడు రిజర్వాయర్ నార్త్ ఫీడర్ కెనాల్ విస్తరణ పనులకు కేబినెట్ ఆమోదం
దాదాపు 100 కి.మీ మేర కాల్వ సామర్థ్యం పెంపు
దీనికోసం రూ.632 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
ఏపీ గేమింగ్ యాక్ట్ –1974 ను చట్టాన్ని సవరిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్ ప్రకారం బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టరూపంలో తీసుకురావాలని నిర్ణయం, దీనికి కేబినెట్ ఆమోదం
ఆన్‌లైన్ జూదం, గేమింగ్‌లపై పూర్తిగా ఉక్కుపాదం మోపాలన్న కేబినెట్
రూ.25వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు కేబినెట్ ఆమోదం
పెన్షనర్లు, ఉద్యోగుల డీఏల చెల్లింపునకు కేబినెట్ ఆమోదం
పెన్షనర్లకు 3.144 శాతం పెంపు, జులై 2018 నుంచి వర్తింపు, జనవరి –2021 నుంచి చెల్లింపు
జనవరి, 2019 నుంచి మరో 3.144శాతం డీఏ పెంపు వర్తింపు, 2021 జులై నుంచి చెల్లింపు
జులై 2019 నుంచి మరో 5.24 శాతం డీఏ పెంపు, జవరి 2022 నుంచి చెల్లింపు
ఉద్యోగులకు జులై 2018 నుంచి 3.144 శాతం డీఏ పెంపు, 2021 జనవరి నుంచి చెల్లింపు
జనవరి, 2019 నుంచి 3.144శాతం పెంచిన డీఏను జులై 2021 నుంచి చెల్లింపు
జులై 2019 నుంచి పెంచిన 5.24శాతం డీఏను జనవరి 2022 నుంచి చెల్లింపు
వైయస్సార్ కడప జిల్లా కొప్పర్తి ‘‘వైయస్సార్ – జగనన్న’’ మెగా ఇండస్ట్రియల్ హబ్ ( వైజేఎంఐహెచ్)కు రాయితీలకు కేబినెట్ ఆమోదం
వేలమందికి ఉపాధి కల్పించనున్న కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్
addComments
Post a Comment