*పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోషల్ మీడియా, నియోజకవర్గ నాయకులు, మంత్రి అభిమానులకు...."మీచిన్న మాట..పెద్ద సాయం*
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిగారంటే అమితమైన అభిమానం చూపించే ప్రతి ఒక్కరికీ చిన్నమాట. నివర్ తుపాన్ ధాటికి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాతో పాటు ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రజలకు ఎదురవుతున్న విద్యుత్, ఆహారం, పునరావాస కేంద్రం, కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నవారికి సాయం చేయాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పిలుపునిచ్చారు. మీ దృష్టికి ఏ సమస్య వచ్చినా అక్కడ పరిస్థితి తెలిసేలా ఒక చిన్న మాట, వీలయితే ఏ మండలం, ఏగ్రామంలో ఇబ్బంది ఉందో ఫోటో తీసి పంపించగలరు. అవసరమయితే ఎంజీఆర్ హెల్ప్ లైన్ నంబర్ 08627221999, వరదల నేపథ్యంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1077 కు కూడా మీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగలరు. ఎప్పటికప్పుడు మంత్రిగారు నియోజకవర్గం, నెల్లూరు జిల్లా గురించి అధికార యంత్రాంగం, స్థానిక నాయకులతో అడిగి తెలుసుకుంటున్నారు. కష్టకాలంలో ప్రతిఒక్కరూ ఒకరికొకరు మీవంతుగా భాగస్వామ్యమవ్వాలని కోరుతూ...
*పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*
addComments
Post a Comment