గ్రామీణ ముఖచిత్రం మారే విధంగా గ్రామస్థాయిలో అభివృద్ధి పనులు – పంచాయితీ రాజ్ శాఖ మంత్రి తిరుపతి (prajaamaravati), నవంబర్ 16 : గ్రామీణ ముఖ చిత్రం మారే విధంగా ముఖ్యమంత్రి గారి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అయిన సచివాలయాలు, రైతు బరోసా కేంద్రాలు, బి ఎం సి యు లు , వెల్ నెస్ సెంటర్ల నిర్మాణాలు నిర్దేశించిన సమయం మేరకు మార్చి 2021 పూర్తి కావడమే లక్ష్యంగా నరేగా అనుబంధ శాఖలతో సమీక్ష నిర్వహించామని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నరేగా అనుసంధాన శాఖలతో వివిధ పనుల పురోగతిపై సమీక్ష అనంతరం ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి తో కలసి పంచాయితీ రాజ్ శాఖ మంత్రి మీడియా ప్రతినిధులకు వివరించారు. ప్రతి నియోజకవర్గంలో రూ.10 కోట్లు కేటాయించి సచివాలయాలు, రైతు బరోసా కేంద్రాలు, బి ఎం సి యు లు , వెల్ నెస్ సెంటర్ల నిర్మాణాలు సాగాలని ముఖ్యమంత్రి సూచించారని త్వరగా పూర్తిచేస్తే అభివృధ్ధి పనులకు మరో రూ.5 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి తెలిపారాని అన్నారు. జిల్లాలో నిర్మాణాలు ఆశాజనకంగా వున్నా రాష్ట్రంలో మెదటి స్థానం రావాలని సూచించమని అన్నారు. గ్రామీణ స్థాయిలో ఈ నిర్మాణాలు పూర్తి అయితే ప్రజలకు పౌర సేవలు వైద్యం, పశువైద్యం, రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటు, పాలసేకరణ కేంద్రాలతో గ్రామ స్థాయిలోనే అన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. గతం ప్రభుత్వంలో చేసిన పనులకు రూ.5 లక్షలలోపు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి అయి అభియోగాలు లేకుండా వున్న పనులకు సమబంధించిన బకాయిలు త్వరలో చెల్లించనున్నామని, మరికొన్ని కోర్టులలో వున్నాయని తెలిపారు.


Comments