విజయనగరం జిల్లా:(prajaamaravati), నియోజకవర్గ కేంద్రమైన నెల్లిమర్లలో రూ.4.42 కోట్ల నాబార్డ్ ఆర్.ఐ.డి.ఎఫ్.-16 నిధులతో నిర్మించనున్న 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం అదనపు భవనాలకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ. కార్యక్రమంలో పాల్గొన్న నెల్లిమర్ల శాసన సభ్యులు శ్రీ బడ్డుకొండ అప్పల నాయుడు, ఎం.పి. శ్రీ బెల్లాన చంద్రశేఖర్, శాసన మండలి సభ్యులు శ్రీ పెనుమత్స సురేష్ బాబు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.జి.నాగభూషణ రావు, ఏ.పి.వైద్య మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ ఎస్.ఇ. శివకుమార్, ఇ.ఇ. సత్య ప్రభాకర్, డి.ఇ.కుమార్ తదితరులు.


Comments