*చరిత్రకు పునాదిగా* *సాంప్రదాయానికి* *అంకురార్పణగా*...... *లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ రోడ్డుమార్గం త్వరలోనే భక్తులకు అందుబాటులోకి రానుంది*... గుంటూరు జిల్లా మంగళగిరి(prajaamaravati), లో టెంపుల్ హిల్ ఎకో పార్క్ కి స్థానిక శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణా రెడ్డి సోమవారం భూమి పూజ నిర్వహించారు ,అటవీశాఖ పరిది లోనిఐదు కిలోమీటర్ల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా మరియు మంగళగిరి మున్సిపాలిటీ పరిదిలోని 600 మీటర్లలోని ఏరియా లో టెంపుల్ హిల్ ఎకో పార్కు నిర్మాణం చేపడుతున్నట్లు తెలియజేశారు ,సుమారు 60(అరవై ) లక్షల రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమం చేస్తున్నామని రెండు నెలల్లోపు సుమారు సంక్రాంతి నాటికి అందుబాటులో ఉంటుందన్నారు, ఈ ప్రాజెక్టు బహుళ ప్రయోజనకారిగా ఉంటుందని లక్ష్మీనరసింహస్వామి భక్తులకు గిరి ప్రదర్శన చేసేందుకు అనుకూలంగానూ పట్టణంలోని ప్రజలకు ఉదయం పూట నడకకు ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ ట్రాక్ గా కూడా ఉపయోగపడుతుందని తెలియజేశారు, అంతేకాకుండా అటవీ శాఖ సంబంధించినటువంటి భూములను ప్రజలు ఆక్రమించి కోకుండా సరైన రక్షణ చర్యలు చేపట్టెందుకు ఉపయోగపడుతుందని ఈ తెలియజేసారు, కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి శివప్రసాద్ ,ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ , మంగళగిరి మున్సిపల్ కమిషనర్ హేమమాలిని , వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు....