శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ (prajaamaravati): శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు ప్రదోష కాలంలో నిర్వహించు పంచహారతులు సేవలో భాగంగా నృత్యం, సంగీతం మరియు నాదం అన్నియు కూడా అమ్మవారి ఎదురుగా ప్రత్యక్షముగా జరిపించుటకు గానూ లోకకల్యాణార్థం సంకల్పించిన కార్యక్రమం ఈరోజు ట్రయల్ రన్ నిర్వహించడం జరిగినది. ఇప్పటివరకూ ఈ కార్యక్రమము పరోక్షంగా మాత్రమే నిర్వహించబడుచున్నది. దేవాలయములో ప్రదోష కాలము నందు ఆహ్లాదకరమైన వాతావరణం లో అమ్మవారి ఎదురుగా నృత్య, గాన మరియు నాద నీరాజనం సమర్పించుట వలన శ్రీ అమ్మవారు ఆనందించి, లోకహితము జరుగునని సంకల్పించి, సదరు కార్యక్రమ ట్రయల్ రన్ నిర్వహించటం జరిగినది. అనంతరం నటరాజ స్వామి ఆలయము వద్ద నున్న ప్రదేశములో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడము జరిగినది.