మహా శివరాత్రి బ్రహ్మో త్సవాలలో సామాన్య భక్తుల దర్శనానికి ఎటు వంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు* చేపట్టండి.

 


 మహా శివరాత్రి బ్రహ్మో త్సవాలలో సామాన్య భక్తుల దర్శనానికి ఎటు వంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు* చేపట్టండి. *కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ మహా శివ రాత్రి బ్రహ్మోత్సవాల నిర్వ హణకు చర్యలు: జిల్లా కలెక్టర్* 


 శ్రీకాళహస్తి (ప్రజా అమరావతి),ఫిబ్రవరి 11:


మహా శివరాత్రి బ్రహ్మోత్స వాలలో సామాన్య భక్తుల దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ శ్రీకాళహస్తి దేవస్థానం ఈ.ఓ పెద్దిరాజు ను ఆదేశించారు. 


గురువారం ఉదయం శ్రీకాళహస్తి దేవస్థానం పరిపాలనా భవనం నందు మార్చి 6 వ తేది నుండి 19 వ తేది వరకు జరుగు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వాహణ పై సంబంధిత శాఖలకు చెందిన అధికారులతో జిల్లా కలెక్టర్, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల  నాయుడు లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశం లో  తిరుపతి ఆర్డిఓ కనకనరసా రెడ్డి,ఆర్ అండ్ బి ఎస్.ఈ దేవానందం, ట్రాన్స్ కో ఎస్.ఈ చలపతి, డి ఎం అండ్ హెచ్ ఓ, డీ సీ హెచ్ ఎస్  డా.పెంచలయ్య, డా.సరళమ్మ,శ్రీకాళహస్తి డిఎస్పీ  విశ్వనాథ్, శ్రీకాళహస్తి మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసులు,  జిల్లా ఫైర్ ఆఫీసర్  బాల రాజు,సిడిపిఓ శాంతి దుర్గ    ఇతర శాఖలకు సంబందిం చిన అధికారులు పాల్గొ నారు.


ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహా శివరాత్రిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు  శ్రీకాళహస్తి స్వామి వారిని దర్శించుకునేందుకు రావడం జరుగుతుందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని,  కోవిడ్ నిబందనలను అనుసరిస్తూ బ్రహ్మోత్సవాల నిర్వాహణ జరగాలని తెలిపారు. సామాన్య భక్తుల దర్శనానికి పెద్ద పీట వేస్తూ  ఎటువంటి ఆటంకం కలుగకుండా క్యూ లైన్ ల నిర్వహణ ఉండా లని, క్యూ లైన్ లో ఉండే భక్తులకు తాగు నీటికి సమస్య లేకుండా చూడాలని,దర్శనానికి వివిధ రాష్ట్రాల నుండి, ప్రాంతాల నుండి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున క్యూ  లైన్ లో తోపులాటలు జరగకుండా మరియు శ్రీకాళ హస్తి పట్టణంలో ట్రాఫిక్ ను నియంత్రిస్తూ వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పోలీసు శాఖ వారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పారిశుద్ధ నిర్వాహణ పక్కా గా చేపట్టాలని  దేవస్థానం వారు మున్సిపల్ కమీషనర్ తో సమన్వయం చేసుకొని పని చేయాలని సూచించారు.ఎక్కడా  గాని విద్యుత్ కు అంతరాయం కలగకుండా ట్రాన్స్ కో వారు తగు చర్యలు చేపట్టాలని   తెలిపారు.

తిరుపతి  అర్బన్ ఎస్పీ మాట్లాడుతూ మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి దేవస్థానం లోపల క్యూ లైన్ ల నిర్వ హణ, శ్రీకాళహస్తిలో ట్రాఫిక్ నియంత్రణకు అన్ని చర్యలు చేపడతామని, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతుందని ,అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ కు వివరించారు. 

ఈ.ఓ పెద్దిరాజు మాట్లాడుతూ మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 6 న ధ్వజారోహణం తో ప్రారంభం అవుతాయని, మార్చి 19వరకు జరుగుతాయని, మార్చి 11 వ తేది మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవం, 12 న రథోత్సవం, 13 న శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం ప్రధానమని, ఈ తేదీలలో భక్తులు ఎక్కువగా రావడం జరుగుతుందని అందుకు అనుగుణంగా క్యూ లైన్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని కలెక్టర్ కు వివరించారు.