కాక్లియర్ ఇంప్లాంట్, డెఫ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ మల్లిఖార్జున, సొసైటీ టు ఎయిడ్ ద హియరింగ్ ఇంపెయిర్డ్ (సాహి) సెక్రటరీ డాక్టర్ ఈ సి వినయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరు.
అమరావతి (ప్రజా అమరావతి):
*సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే..:*
చెవిటి, మూగ వైకల్య రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలి: సీఎం
కంటి వెలుగు తరహాలో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయాలి : సీఎం
బాధితుల్లో ఇలాంటి లోపాలను ముందుగా గుర్తించి వారికి వీలైనంత త్వరగా ఆపరేషన్లు చేయాలి: సీఎం
పాదయాత్రలో కనీసం 100 మంది పిల్లలు నా దగ్గరకు వచ్చారు:
వారందరికీ ఆపరేషన్లు చేయించాం: సీఎం
ఇలాంటి వైకల్యంతో బాధపడేవారికి అండగా ఉండాలన్నదే లక్ష్యం:
చెవిటి, మూగ వైకల్యం నివారించడానికి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో అమలు చేస్తున్న విధానాలపై సమావేశంలో చర్చ
వ్యాక్సినేషన్ కార్యక్రమంతో అనుసంధానం చేయడంపై సమావేశంలో చర్చ
అలాగే పాఠశాల విద్యార్థులకు కూడా శబ్ధగ్రహణ పరీక్షలపై సమావేశంలో చర్చ
ఇలాంటి కార్యక్రమాలతో వినికిడి లోపాన్ని ముందుగానే గుర్తించి తగిన విధంగా వైద్యం చేయించే అవకాశం ఉంటుందని సమావేశంలో వెల్లడి
కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను దేశంలో తొలిసారిగా ప్రారంభించిన ఘనత ఏపీకి దక్కుతుందని, ఏపీ సీఎం జగన్.. వినికిడి, మూగ లోపాలతో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలుస్తున్నారని ప్రశంస
ప్రస్తుతం నిర్వహిస్తున్న కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను మరింత ఆధునికంగా నిర్వహించడంపై సమావేశంలో చర్చ
ఎంఆర్‌ఐ కంపాటిబిలిటీతో ఆధునిక పరిజ్ఞానం సహాయంతో ఆపరేషన్లు చేయడంపై సమావేశంలో చర్చ
స్క్రీనింగ్ లో గుర్తించిన వారికి పూర్తిస్థాయి వైద్యం, ఆపరేషన్లు చేయంచడంపై సమగ్ర కార్యాచరణ ఉండాలన్న సీఎం
అప్పుడే పుట్టిన శిశువులతో పాటు, చిన్నారులకు, స్కూలు విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించాలి
వీటికి అవసరమైన పరికరాలు, వాటి నిర్వహణా విధానం,
అలాగే వినికిడి, మూగ లాంటి లోపాలు గుర్తించిన వారికి కంటి వెలుగు తరహాలోనే సర్జరీలు చేయించాలి సీఎం ఆదేశం
దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలు పై దృష్టి పెట్టాలన్న సీఎం
సర్జరీలు చేయాల్సిన అవసరంలేని వారికి అందించాల్సిన పరికరాలపైనా ఆలోచన చేసి, వీటన్నింటిపై సమగ్ర కార్యాచరణ తయారు చేయాలని సీఎం ఆదేశం
ఆస్పత్రుల్లో అప్పుడే పుట్టిన శిశువులకు, విలేజ్ క్లినిక్స్‌లో చిన్నారులకు, కంటివెలుగు తరహాలో పాఠశాలల్లో చిన్నారులకు, వినికిడి సమస్య ఉందా? లేదా? అన్నదానిపై పరీక్షలు నిర్వహించడంపై చర్యలు తీసుకోవాలన్న సీఎం
1వ నెల, 3వనెల, 6వ నెలల్లో పరీక్షలు చేయించాల్సి ఉందన్న నిపుణులు
పీహెచ్‌సీలు, 104 లలో కూడా పరీక్షలు చేసేందుకు పరికరాలు పెట్టేలా ఆలోచనలు చేయాలన్న సీఎం
పరీక్షలు చేసిన తర్వాత లోపాలు లేకపోతే ఆ పిల్లలను సర్టిఫై చేయాలన్న సీఎం
చెవిటి, మూగ లోపాలను ముందుగానే గుర్తించడానికి నిర్వహించే పరీక్షలపై సమగ్ర ప్రణాళిక తయారుచేయాలని సీఎం ఆదేశం
కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసే పరిస్థితి ప్రభుత్వాసుపత్రుల్లో ఉండాలన్న సీఎం
ప్రతి బోధనాసుపత్రిలో అలాంటి సర్జరీలు చేసే సదుపాయాలు ఉండాలన్న సీఎం
ఈ స్థాయిలో స్క్రీనింగ్ ఎప్పుడూ చేయలేదు :సీఎం
కంటి వెలుగు మాదిరిగా స్క్రీనింగ్ చేయాలన్న సీఎం
అలాగే అవగాహన, చైతన్యాన్ని కలిగించగలుగుతామన్న సీఎం
అలాగే అవ్వాతాతలు కూడా వినికిడి సమస్యతో బాధపడుతున్నారని, వారికికూడా పరికరాలు అందించేలా కార్యాచరణ ఉండాలన్న సీఎం
ఇలా ప్రతిదశలోనూ కూడా ఎస్‌ఓపీలను తయారుచేయాలన్న సీఎం
కోవిడ్ కారణంగా నిలిచిపోయిన కంటివెలుగు ఆపరేషన్లను పూర్తిచేయాలి : సీఎం స్పష్టీకరణ.
addComments
Post a Comment