తొలిదశ పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లను పగడ్బందీగా చేయండి: నోడల్ అధికారులకు ఎన్నికల పరిశీలకుల అదేశం.



తొలిదశ పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లను పగడ్బందీగా చేయండి: నోడల్ అధికారులకు ఎన్నికల పరిశీలకుల అదేశం.



*జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లుభేష్: పరిశీలికులు* 


కర్నూలు (ప్రజా అమరావతి), ఫిబ్రవరి8: కర్నూలు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప ల ఆధ్వర్యంలో తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల  ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని అయితే మరింత అప్రమత్తంగా ఉంటూ మేజర్ గ్రామ పంచాయతీలలో కౌంటింగ్ ఏర్పాట్లను, రౌండ్ వారీ ఫలితాల ప్రకటన ఏర్పాట్లను మరొక్కసారి సరిచూసుకుని ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎస్.ఈ.సి ఆదేశాల మేరకు పగడ్బందీగా చేయాలని ఎస్.ఈ.సి తరఫున జిల్లాకు వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికల జనరల్ పరిశీలకులు సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.ఎం.నాయక్, వ్యయ పరిశీలకులు వినీత్ కుమార్ తో కలిసి జిల్లా నోడల్ అధికారులతో సోమవారం మద్యాహ్నం  కలెక్టరేట్ కాన్ఫరెన్సు హాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల వార్ రూమ్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆదేశించారు.


ఈ సందర్భంగా జేసీలు రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డిపిఓ ప్రభాకర్ రావ్ లు జిల్లాలో చేసిన ఎన్నికల ఏర్పాట్లను వివరించగా, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, ఐసిడిఎస్ పిడి భాగ్యరేఖ, డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, డిసిఓ రామాంజనేయులు, సమాచార శాఖ డిడి తిమ్మప్ప, డీఈ జయరావు తదితర జిల్లా నోడల్ అధికారులు వారి వారి నోడల్ కమిటీ తరఫున చేసిన ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకులకు వివరించారు. 


ఈ సందర్భంగా ఎన్నికల జనరల్ పరిశీలకులు ఎం.ఎం.నాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని అయితే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న చాగలమర్రి,వెలుగోడు, సిరివెళ్ల, బండి ఆత్మకూరు లాంటి మేజర్ గ్రామ పంచాయతీలలో ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే చేసిన ఏర్పాట్లను పరిశీలించామని,  మరింత పగడ్బందీగా చేసుకోవాలని డిపిఓ ప్రభాకర్ రావు ను ఆదేశించారు.


అలాగే అన్ని పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు, నిరంతర విద్యుత్ ఉండాలని, మేజర్ గ్రామ పంచాయతీలలో జెనరేటర్ ను కూడా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి మండలంలో విద్యుత్ ఎ.ఈ.అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎం.ఎం.నాయక్ ఆదేశించారు.


అలాగే, అన్ని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది, ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పేపర్లు చేరాయా అని ఎం.ఎం.నాయక్ అరా తీయగా పోలింగ్ సిబ్బందితో పాటు 36 రకాల పోలింగ్ సామగ్రి 12 మండలాల్లో  1515 పోలింగ్ కేంద్రాలకు చేరాయని నోడల్ అధికారులు వివరించారు.


సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ గ్రామ పంచాయతీలలో సూక్ష్మ పరిశీలకులు, వెబ్ క్యాస్టింగ్ సిబ్బంది, వీడియో గ్రాఫర్లను అలెర్ట్ గా ఉండేలా మరొక్కమారు తెలపాలని ఎం.ఎం.నాయక్ ఆదేశించారు.


కమాండ్ కంట్రోల్ రూమ్ ఫిర్యాదులు మోడల్ కోడ్ ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులతో పాటు ప్రెస్,మీడియా లో వచ్చే అడ్వర్స్ రిపోర్ట్స్ ను కూడా ఆయా మండల ఎన్నికల అధికారులకు పంపి యాక్షన్ టేకన్ రిపోర్టులను వెంటనే తెప్పించుకోవాలని ఆయన ఆదేశించారు.


వ్యయ పరిశీలకులు వినీత్ కుమార్ మాట్లాడుతూ మండల జిల్లా ఎన్నికల వ్యయ నోడల్ టీమ్ మండల ఏఈఓలకు, మండల ఎన్నికల అధికారులకు పదే పదే చెప్పి ప్రతి రోజూ సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కు సంబంధించి పర్సనల్ రిజిస్టర్లో వ్రాసేలా చెక్ చేయాలని, ఎన్నికల ఖర్చు వివరాలను ప్రతి రోజూ సమీక్ష చేయాలని డిసిఓ రామాంజనేయులను వ్యయ పరిశీలకులు వినీత్ కుమార్ ఆదేశించారు


Comments