20 నెలల ముఖ్యమంత్రి పాలనకు ప్రజల పట్టాభిషేకం : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.


శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.(ప్రజా అమరావతి);



20 నెలల ముఖ్యమంత్రి పాలనకు ప్రజల పట్టాభిషేకం : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.



*ప్రజల సంక్షేమాన్ని చూసే సీఎం..ముఖ్యమంత్రి నాయకత్వంపై ప్రజలకుండే విశ్వాసానికిదే నిదర్శనం*


*వార్డు వాలంటీర్ ను మున్సిపల్ ఛైర్మన్ గా ప్రకటించి వినూత్న, విలక్షణ ఒరవడికి మంత్రి మేకపాటి  శ్రీకారం*


*వాలంటీర్లను నాయకులుగా చేస్తామన్న సీఎం ప్రకటనను ఆచరణలో చూపించిన మంత్రి గౌతమ్ రెడ్డి*


*మంత్రి సొంత నియోజకవర్గంలోని ఆత్మకూరు మున్సిపాలిటీలో 23 వార్డులకు గానూ 19 చోట్ల విజయఢంకా*


*మరో రెండు వార్డులలో వైసీపీ రెబల్స్ గెలుపు*


*ఎన్నికలకు ముందే 6 వార్డుల్లో ఏకగ్రీవం*


*ఆత్మకూరు మున్సిపల్ కౌన్సిలర్లను, వారి గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించిన మంత్రి మేకపాటి*


ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున గెలుపొందిన కౌన్సిలర్లు, పార్టీ నాయకులకు, సమన్వయకర్తలకు మంత్రి ప్రశంసలు


సచివాలయంలోని 15వార్డులో   సేవలందించే  ఎస్టీ వాలంటీర్ మహిళ గోపారం వెంకటరమణమ్మను కౌన్సిలర్ గా గెలిపించి మున్సిపల్ ఛైర్మన్ గా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరచిన మంత్రి గౌతమ్ రెడ్డి


ముఖ్యమంత్రి ఆలోచనను ఆచరణలో చూపించి ప్రత్యేకంగా నిలిచిన మంత్రి మేకపాటి


285 ఓట్లతో మెజారిటీ విజయం సాధించిన గోపారం వెంకటరమణమ్మను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి


నూతన మున్సిపల్ చైర్ పర్సన్ గా గోపారం వెంకటరమణమ్మను మంత్రి ప్రతిపాదనను.. ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులు 


మంత్రి నిర్ణయం పట్ల పార్టీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు, కౌన్సిలర్లు, మండలనాయకుల హర్షం 


నిజాయతీ, నిస్వార్థంతో పని చేసే వారిని గుర్తించి, సముచిత స్థానం కల్పిస్తానని చెప్పకనే చెప్పిన మంత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎంపిక


నాదేం లేదు..నా విజయం వెనుక నియోజకవర్గం ప్రజలు..నా ముందు నన్ను నడిపించే ముఖ్యమంత్రిదే ఈ గెలుపని కౌన్సిలర్లతో సంభాషణలో వ్యాఖ్యానించిన మంత్రి మేకపాటి


నెల్లూరులోని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నివాసంలో ఆదివారం సాయంత్రం మంత్రిని, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని కలిసిన కౌన్సిలర్లు


అనంతరం ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి మేకపాటి 


కరోనా కష్టకాలంలో దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రజలకు నిత్యవసరాలు అందించడంతో పాటు కరోనా వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేశారు


 రాష్ట్రంలో జరిగిన కరోనా సేవల పట్ల దేశమంతా కొనియాడింది


పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో  ప్రభుత్వం పట్ల మరింత ఆదరణ చూపిన ప్రజలు 


ఆత్మకూరు మున్సిపల్ కౌన్సిలర్లుగా 19 మంది వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించడం పట్ల  కృతజ్ఞతలు 


ప్రభుత్వ ఆశయాలు నెరవేరేలా నూతన కౌన్సిలర్లు ప్రజలకు అందుబాటులో ఉండి రెట్టించిన ఉత్సాహంతో బాధ్యతగా విధులు నిర్వహించాలి 



Comments