విజయవాడ (ప్రజా అమరావతి);
పడ్ నా లిఖ్ నా అభియాన్ (అక్షరాస్యత కార్యక్రమం ) ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ , ఇబ్రహీంపట్నం లోని
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ భవనంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
40 రోజుల ఈ అక్షరాస్యత కార్యక్రమంలో రాష్ట్రంలో ని 3,28,000 మందికి చదవడం, రాయడం నేర్పుతాము. ఇందులో పురుషులు 88 వేల మంది, మహిళలు 2,40,000 వేల మంది ని గుర్తించాము.
చదువు దాటిపోయీన వయస్సులో ఉన్నవారికి వయోజన విద్యని అందించడం హర్షదాయకం..
15 సంవత్సరాల దాటి చదువు లేని వారిని బడికి తీసుకుని వొచ్చే కార్యక్రమంలో గ్రామ వార్డ్ సచివాలయంలో ని సిబ్బంది ద్వారా చేపట్టడం జరుగుతోంది.
సోదరి వై. శివకుమారి మాటలు ఆలోచించేలా ఉన్నాయి,, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన తో రాష్ట్రంలో100 శాతం అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నారు.
పడ్ నా లిఖ్ నా అభియాన్ కార్యక్రమానికి నిధులు లేమి లేదు, విద్యా శాఖ లో నిధులు గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నిధులను ప్రభుత్వం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతోనే అన్ని రాష్ట్రాలలో విద్యా శాఖ కార్యక్రమాలు నిర్వహించారు.. అందుకు భిన్నంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లో నాడు నేడు కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర బడ్జెట్ లో 20 శాతం నిధులు విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. రాష్ట్ర విద్య శాఖ తరపున ఈ ఉగాది నాటికి తీపి కబురు అందించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికి ఉన్న 26 నిరక్షరాస్యత శాతాన్ని సగానికి తగ్గించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు కె ఎస్ లక్ష్మణ రావు, పాఠశాల విద్యా పర్యవేక్షణ మరియు నియంత్రణ కమిషన్ వైస్ ఛైర్మన్ విజయ శారద రెడ్డి, వయోజన విద్యా సంచాలకులు వై. జయప్రద, కొండపల్లి గ్రామ ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment