ప్రజావైద్యం బలోపేతం చేసే లక్ష్యం మన ముఖ్యమంత్రిది !! - మంత్రి పేర్ని నాని


మచిలీపట్నం : ఏప్రిల్ 6 (ప్రజా అమరావతి);


 ప్రజావైద్యం బలోపేతం చేసే లక్ష్యం మన ముఖ్యమంత్రిది !!

      -  మంత్రి పేర్ని నాని  


అత్యాధునిక వైద్యాన్ని నిరుపేదలకు చేరువ చేయడం ద్వారా  ప్రజావైద్యం బలోపేతం చేసే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ప్రశంసించారు. 

     మంగళవారం ఉదయం ఆయన మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో  గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఎండోస్కోపి విభాగంలో 

 45  లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన గ్యాసోస్కోపి కలనోస్కోపి యూనిట్‌ ను లాంఛనంగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వాసుపత్రిలో అత్యాధునిక సేవలు ఇకపై ప్రతి బుధవారం , శనివారం లభ్యమవుతాయని ప్రకటించారు.   

       వ్యాధి నిర్ధారణలో కీలకంగా మారిన ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌, ఎండోస్కోపి వంటి వైద్య పరికరాల ద్వారా జరిపే పరీక్షలను ప్రయివేట్ ఆసుపత్రులలో ఎక్కువ ధర చెల్లించి చేయించుకోవాల్సిన దుస్థితి పేదవారికి ఏర్పడిందని ఈ విషయాన్ని దృష్టిలో ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యంత ఆధునిక చికిత్సా విధానాలను ఉచితంగా ప్రజలకు ఏర్పాటుచేసిందన్నారు. 

                        ఎండోస్కోపీ ,లాపరోస్కోపీ అనేది శరీరంలోని లోపలి ప్రాంతాలను సాధారణ  కళ్ళకు కనిపించనివి సైతం చూడగలిగేలా చేసే రోగనిర్ధారణ ప్రక్రియలని తెలిపారు. ఎగువ ఎలిమెంటరీ కెనాల్ యొక్క ఎండోస్కోపీ అనేది గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, మింగే గొట్టం (అన్నవాహిక), కడుపు మరియు డుయోడెనమ్ (చిన్న ప్రేగు యొక్క ప్రారంభ భాగం)ను అంచనా వేయడానికి అనుమతించే ఒక ప్రక్రియ అని అన్నారు. లాపరోస్కోపీ అనేది లాపరోస్కోపీ విధానాన్ని ఉపయోగించడం ద్వారా మొత్తం ఉదర కుహరం, అండాశయాలు మరియు గర్భాశయం మరియు గొట్టాల బాహ్య భాగాల యొక్క ప్రత్యక్ష విజువలైజేషన్ చేయడానికి, వీడియో రికార్డింగ్  ఫిలింలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడిందన్నారు. కృష్ణాజిల్లాలో మొదటిసారిగా ఈ ఆధునికమైన చికిత్స విధానం ఏర్పాటైనట్లు తెలిపారు. నిపుణులైన వైద్యుడు కేసు షీట్ చేసుకోవడం రోగి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఉదరంలో గాస్ట్రిక్ ట్రబుల్ , అల్సర్ లక్షణాలను కనుగొనడమేకాక ఏర్పడుతున్న కాన్సర్ కణుతులను  తొలిదశలోనే గుర్తించే వీలుందన్నారు `.  

      పెద్దప్రేగు శస్త్రచికిత్స అనేది పెద్దప్రేగు లోపలి భాగంలో కనిపించే ప్రక్రియనిఇది అంతిమభాగంలో కాంతితో సౌకర్యవంతమైన ట్యూబ్ ఇన్సర్ట్ చేయడం ద్వారా జరుగుతుందని చెప్పారు. ఒక నిపుణుడైన వైద్యుడు గొట్టం ద్వారా పుపుస ద్వారా మరియు పెద్దప్రేగు భాగంలో లోపలికి చూడడానికి మరియు పాలిప్స్ లేదా ఇతర అసాధారణతల కొరకు  పరీక్షించే వీలు ఏర్పడుతుందన్నారు. . ఇది 50 ఏళ్ల వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ కొలొరెక్టల్ క్యాన్సర్ ను పరీక్షించటానికి స్క్రీనింగ్ కొలోనోస్కోపీని పొందాలని సిఫారసు చేస్తారని,  మచిలీపట్నం ఈ ఆధునిక వైద్య వసతిని కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి మంత్రి పేర్ని నాని కృతజ్ఞతలు తెలిపారు. 

       ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత , బందరు ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి, నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డెప్యూటీ మేయర్ తంటిపూడి  కవిత,  మునిసిపల్  కమీషనర్ శివరామకృష్ణ, తహసీల్దార్ సునీల్,  మాజీ మునిసిపల్ ఛైర్మెన్  సలార్ దాదా,  ఆసుపత్రి సూపరెండెంట్ డాక్టర్ మాధవి,  ఆర్ ఎం ఓ  డాక్టర్  పి వి ఎస్ మల్లిఖార్జునరావు,  డి సి హెచ్ జ్యోతీర్మణి , డాక్టర్ అల్లాడ శ్రీనివాస్,  డాక్టర్ జగదీష్  వివిధ డివిజన్ల కార్పొరేటర్లు ,  పార్టీ అధికార ప్రతినిధి మాదివాడ రాము,  అర్బన్ బ్యాంకు మాజీ ఛైర్మెన్ బొర్రా విఠల్   తదితరులు పాల్గొన్నారు.   

   

Comments