జిల్లాలో నేడు జరిగిన టీకా ఉత్సవ్ విజయ వంతం. *జిల్లా వ్యాప్తంగా 120 పిహెచ్ సి ల పరిధి లోని సచివాలయా లలో కోవిడ్ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ లో నేడు ఒక్కరోజే 60 వేల డోసుల వ్యాక్సి నేషన్ వేశాం* *జిల్లా లో ఇప్పటి వరకు 4లక్షల 40 వేల మందికి పైగా వ్యాక్సిన్ వేశాం* *45సం. రాలు పైబడిన వారు వ్యాక్సిన్ పై అపోహలు వీడి.. స్వచ్చందంగా ముందుకు రండి:జిల్లా కలెక్టర్* *చిత్తూరు, ఏప్రిల్ 14 (prajaamaravathi):* *జిల్లాలో టీకా ఉత్సవ్ కార్యక్రమం విజయవంతం అయినదని కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించామని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ తెలిపారు. బుధవారం జిల్లాలో కోవిడ్ వాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ కార్య క్రమం ను అందరి సహకారం తో విజయ వoతంచేశామని తెలిపారు.* *ఈ సందర్భంగా జిల్లా కలె క్టర్ మాట్లాడుతూ జిల్లాలో టీకా ఉత్సవ్ లో భాగంగా జిల్లాకు ఈ నెల 13 న 60వేలడోసుల టీకాలు అందాయని, వీటిని జిల్లాలోని 120 రూరల్, అర్బన్ పి హెచ్సీల పరిధిలోని సచివాలయాల లో వ్యాక్సిన్ వేయడం జరిగిందని తెలిపారు.. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, వివిధ శాఖల సిబ్బంది, రెవెన్యూ ఉద్యోగులు జిల్లాలో 45 ఏళ్లు పైబడిన వారికి,ఇంక నూ టీకా వేయించుకో ని ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ వర్కర్లు లకు అవగాహన కల్పించి టీకా వేశామని తెలిపారు...* *జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఉ.7 గంటలకు ప్రారంభం అయిన వ్యాక్సినేషన్ కార్యక్రమం రాత్రి వరకు జరగగా 60 వేల డోసుల వ్యాక్సిన్ వేసి 100 శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు.* *జిల్లాలో ఇప్పటి వరకు 4 లక్షల 40 వేల మందికి పైగా వ్యాక్సిన్ వేశామని.. గ్రామస్థాయిలో వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించా రన్నారు. జిల్లా లో 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు.. అపోహలు వీడి స్వచ్చందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు.
జిల్లాలో నేడు జరిగిన టీకా ఉత్సవ్ విజయ వంతం.
addComments
Post a Comment