తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల నిర్వహణ కు కేటాయించిన పిఓ లు, ఏపిఓ లకు ఈవిఎం, వివిప్యాట్ల వాడకం పై ప్రయోగపూర్వకంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించండి

 తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల నిర్వహణ కు కేటాయించిన పిఓ లు, ఏపిఓ లకు ఈవిఎం, వివిప్యాట్ల వాడకం పై ప్రయోగపూర్వకంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించండి


* *11, 12వ తేదీలలో పోలింగ్ సిబ్బందికి వ్యాక్సినేషన్ ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయండి* *కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఉప ఎన్నికల నిర్వహణ . . డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ ల వద్ద మాస్క్ లు, స్యానిటైజర్లు అందుబాటులో ఉంచండి* *ఈ నెల 12 వ తేదీ లోపు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ లను పూర్తి స్థాయిలో ఓటర్ లకు అందించే ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు* *బిఎల్ఓ లకు బూత్ యాప్ వాడకం పై పూర్తి స్థాయిలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించండి* *ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ను ధరించాలి* *: జిల్లా కలెక్టర్* చిత్తూరు, ఏప్రిల్ 9 (prajaamaravathi): తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల నిర్వహణకు కేటాయించిన పిఓ లు, ఏపిఓ లకు ఈవిఎం, వివిప్యాట్ల వాడకం పై పూర్తి అవగాహన కల్పించేలా పరిమిత సంఖ్యలో విడతల వారీగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ ఏఆర్ఓ లను ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ జెసిలు (అభివృద్ధి, సంక్షేమం) వి. వీరబ్రహ్మం, రాజశేఖర్, డిఆర్ఓ మురళి, చిత్తూర్ ఆర్డిఓ డా. రేణుక లతో కలసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలకు సంబంధించి సమీక్ష నిర్వహించి తగు సూచనలు జరీ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ గిరీషా, తిరుపతి ఏఆర్ఓ చంద్రమౌళీశ్వర రెడ్డి, శ్రీకాళహస్తి ఏఆర్ఓ శ్రీనివాస్, సత్యవేడు ఏఆర్ఓ చంద్రశేఖర్ మరియి సంబంధిత మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉప ఎన్నికలలో పాల్గొనే పిఓ లు, ఏపిఓ లకు ప్రధానంగా ఈవిఎం, వివిప్యాట్ల వాడకం, పిఓ డైరీ లకు సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగేలా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ శిక్షణా కార్యక్రమాలను పరిమిత సంఖ్య సిబ్బందితో నిర్వహిస్తూ టివి ల ద్వారా ఈవిఎంలు, వివిప్యాట్ల వాడకం పై ప్రయోగపూర్వకంగా అవగాహన కల్పించాలన్నారు. శిక్షణా కార్యక్రమాల అనంతరం ఈవిఎం, వివిప్యాట్ల వాడకం పై పూర్తి అవగాహన పొందినట్లు పిఓ లు, ఏపిఓ ల నుండి సర్టిఫికెట్లు పొందాలని సూచించారు. ఈ నెల 16 న పోలింగ్ నిమిత్తం ఈవిఎం, వివిప్యాట్ల లను పిఓ లు స్వాధీన పరచుకునే సమయం లో అందుకు సంబంధించిన అక్నాలెడ్జిమెంట్ ఇవ్వాలని పోలింగ్ అనంతరం రిసెప్షన్ సెంటర్ నందు ఈ వి ఎం ల స్వీకరణకు గానూ ప్రత్యేక కౌంటర్ లను ఏర్పాటులో భాగంగా స్పెషల్ కౌంటర్, ఈవిఎం కౌంటర్, జనరల్ కౌంటర్ ఇలా 3 కేటగిరీల కింద ఏర్పాటు చేసి ఈ వి ఎం లను తీసుకునే సమయంలో పిఓ డైరీ, ఇతర సంబంధిత వివరాలను పొందే విధంగా సిబ్బందిని నియామకం చేయాలని తెలిపారు. సెక్టోరల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన స్ట్రాంగ్ రూమ్ ను సీల్ చేసే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద సిబ్బందికి భోజన వసతి, త్రాగు నీరు వంటి సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఈ నెల 11 న పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేందుకు ఫెసిలిటేషన్ సెంటర్ న ఏర్పాటు చేయాలని, 80 సం. లకు పైబడిన వారికి స్పెషల్ పోలింగ్ టీంల ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ సిబ్బంది అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని, ఈ నెల 11, 12 వ తేదీలలో వ్యాక్సినేషన్ చేయుకోవడానికి ఫెసిలిటేషన్ సెంటర్ ను డి ఎం అండ్ హెచ్ ఓ నుసమన్వయం చేసుకుని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ నెల 12 వ తేదీ లోపు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ లను పూర్తి స్థాయిలో ఓటర్లకు అందించే ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. బి ఎల్ ఓ లకు బూత్ యాప్ వాడకం పై పూర్తి స్థాయిలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం నందు కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ వాటి పై అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోని విభిన్న ప్రతిభావంతులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వాహన సౌకర్యాలను ఏర్పాటు చేయడం తో పాటు పోలింగ్ కేంద్రం నందు వీల్ చైర్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తిరుపతి అర్బన్, శ్రీకాళహస్తి టౌన్ లలో ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద పోలింగ్ బూత్ వివరాలు తెలిపే విధంగా ఫ్లెక్సీ ల ఏర్పాటు చేయాలని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించే మాక్ పోల్ సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం నందు మాస్క్ లు, శానిటైజర్లు, థర్మల్ స్కానర్ లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. 

Comments